26న మోడీ ప్రమాణం, కేబినెట్లో ఎపి నుండి ఇద్దరికి?

న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఈ నెల 26వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ ఎదుట మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిజెపి పార్లమెంటరీ బోర్డు, ఎన్డీయే పక్షాల సమావేశం అనంతరం మధ్యాహ్నం ఎన్డీయే బృందం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసింది.

తాము తమ నేతగా మోడీని ఎన్నుకున్నట్లు రాష్ట్రపతికి తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మోడీని, ఎన్డీయేను అభినందించారు. ఆ తర్వాత రాష్ట్రపతితో మోడీ కాసేపు ఏకాంతంగా చర్చించారు. వారు పలు అంశాల పైన చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. వీరంతా అద్వానీ నేతృత్వంలో ప్రణబ్‌ను కలిశారు. మోడీ ప్రమాణ స్వీకారానికి మూడువేల మందిని ఆహ్వానించినట్లు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

 Modi to take oath as Prime Minister on May 26 at 6pm

మోడీ కేబినెట్లో టిడిపి నుండి ఇద్దరికి?

నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఇద్దరికి అవకాశముందని తెలుస్తోంది. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రెండు పదవులు ఇవ్వాలని బిజెపి నేతలను కోరినట్లుగా తెలుస్తోంది.

రాష్ట్రపతితో భేటీ అనంతరం చంద్రబాబును బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ తన వెంట తీసుకెళ్లారు. అనంతరం ఢిల్లీలోని గుజరాత్ భవన్లో మోడీతో చంద్రబాబు భేటీ అయ్యారు. కాగా మొదటి విడతగా మంత్రివర్గంలో ఒకరికి ఇస్తామని బిజెపి చెప్పినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+