పాకిస్తాన్ పైనే కాదు రాజకీయ ప్రత్యర్థులపై దిమ్మతిరిగేలా మోదీ మార్క్ అస్త్రం!
ఆపరేషన్ సిందూర్ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ నిన్న అర్ధరాత్రి 25 నిమిషాల పాటు జరిపిన సైనిక చర్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పహల్గాం లో అమాయక టూరిస్టులను అత్యంత అమానవీయంగా మతోన్మాదం పేరుతో చంపిన టెర్రరిస్టులను హతమార్చడానికి పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన భారత సర్కార్ అందుకు తగ్గట్టుగా త్రిముఖ వ్యూహాన్ని రచించి నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది.
మోడీ చర్యతో ప్రత్యర్థి పార్టీల నోటికి తాళం
భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వార్ రూమ్ లో ఉండి ఆపరేషన్ సిందూర్ పర్యవేక్షించారు. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి ప్రధాని నరేంద్ర మోడీ ఈ చర్యతో పాకిస్తాన్ కు ఒక సీరియస్ వార్నింగ్ పంపించారు. ఇది మాత్రమే కాదు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ చర్య ద్వారా ప్రత్యర్థి పార్టీల నోటికి తాళం వేశారు.

ప్రధాని నరేంద్ర మోడీకి సెల్యూట్
నిన్న మొన్నటి వరకు నరేంద్ర మోడీ, మోడీ సర్కార్ ఏం చేసినా ప్రతి దాంట్లోనూ తప్పులను వెతికి మరీ టార్గెట్ చేసిన ప్రత్యర్థి పార్టీలు ఇప్పుడు నోరు మెదపలేని పరిస్థితి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం, ఉగ్రవాదులు టార్గెట్ గా నిన్న అర్ధరాత్రి తీసుకున్న సైనిక చర్య ప్రతి ఒక్కరి తోనూ ప్రధాని నరేంద్ర మోడీ కి సెల్యూట్ చేయిస్తుంది.
ప్రతిపక్ష పార్టీలకు మోడీ నిర్ణయాన్ని సమర్ధించక తప్పని స్థితి
మోడీ తీసుకున్న నిర్ణయం దేశం మొత్తం హర్షించే నిర్ణయం కావడంతో ప్రతిపక్ష పార్టీలకు కూడా ఈ చర్యను మెచ్చుకోక తప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అత్యవసర భేటీ నిర్వహించి ఆపరేషన్ సిందూర్ పైన, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం పైన చర్చించింది. ఫైనల్ గా భారత ఆర్మీ ని ప్రశంసించి అభినందనలు తెలియజేసింది.
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు సైతం ఆపరేషన్ సిందూర్ కు మద్దతు
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి ముఖ్య నాయకులు పాకిస్తాన్లోనూ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తిష్ట వేసిన ఉగ్రవాదులను ఏరివేయడానికి ఆర్మీ తీసుకున్న ప్రతి చర్యను, కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులను సమర్ధిస్తున్నామని ప్రకటించవలసి వచ్చింది. ఇక మరోవైపు నిన్నటి వరకు బిజెపి అంటేనే కారాలు, మిరియాలు నూరిన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వంటి నేతలు సైతం ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని అభినందించక తప్పలేదు.
ప్రత్యర్థి వర్గాలను లాక్ చేసిన మోదీ వ్యూహం
ఆపరేషన్ సింధూర్ తర్వాత, బిజెపిని, బిజెపి పాలనను బలంగా వ్యతిరేకించే మమతా బెనర్జీ వంటి నేతలు కూడా జైహింద్, జై ఇండియా అంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు మద్దతుగా మాట్లాడవలసి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ వంటి శత్రు దేశాన్ని కాదు, దేశంలో ఉన్న ప్రత్యర్థి వర్గాలను సైతం ఆపరేషన్ సిందూర్ తో నోరు మూయించి ఒక్కసారిగా తన ఇమేజ్ ను పెంచుకున్నారు.
ఆపరేషన్ సిందూర్ తో ఎన్డీయే ప్రభుత్వం మరింత బలం
పక్కా ప్లాన్ తో ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రధాని మోదీకి తిరుగులేని నాయకుడుగా మంచి గుర్తింపును తీసుకురావడం అనేక సందర్భాలలో కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా ఆపరేషన్ సిందూర్ తో ప్రత్యర్థి పార్టీలు దిక్కుతోచని స్థితికి చేరుకున్నాయి. ఈ చర్యతో ఎన్డీయే ప్రభుత్వం మరింత బలం పుంజుకుంది.












Click it and Unblock the Notifications