వాట్ ఏ మ్యాన్: మోడీని ఆకాశానికెత్తిన డిగ్గీ మరదలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ మరదలు ప్రశంసలు కురిపించారు. మోడీ విమర్శకుల్లో దిగ్విజయ్ సింగ్ ముందుంటారు. అలాంటి దిగ్విజయ్ సింగ్ కూడా ఇటీవల జమ్ము కాశ్మీర్ వరదల సమయంలో మోడీని అభినందించారు.

ఇప్పుడు ఆయన మరదలు రుబీనా సింగ్ ప్రధాని పైన ప్రశంసలు కురిపించారు. రుబీనా సింగ్.. దిగ్విజయ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ సతీమణి. దిగ్విజయ్ సింగ్‌తో యాంకర్ పెళ్లి అంశం సమయంలోను ఆమె వార్తల్లోకి వచ్చారు. ఇప్పుడు ఆమె మోడీని ఆకాశానికెత్తారు. ట్విట్టర్‌లో ఆమె మోడీ పైన స్పందించారు.
నరేంద్ర మోడీ మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నారని, పార్టీలోని కొందరు ఫూలిష్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని ఆమె ట్వీట్ చేశారు. అంతేకాదు, అతను సమర్థవంతంగా ముందుకు సాగుతున్నాడని, వాట్ ఏ మ్యాన్ అంటూ ఆమె ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications