మోదీ, యోగికి ఆవు, ఎద్దులు బంధువులు : యూపీ నేత వినయ్ వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో : సార్వత్రిక ఎన్నికల వేళ నేతల నోటిదురుసు ఎక్కువవుతోంది. బహిరంగసభల్లో జనవాహిని చూసి ఊపు వస్తోందెమో కానీ .. మాటలు కోటలు దాటుతున్నాయి. ల కామెంట్లను సీరియస్ గా తీసుకున్న ఈసీ .. కొద్దిరోజులు ప్రచారంపై నిషేధం విధించినా, మిగతా నేతల్లో మాత్రం మార్పురావడం లేదు.

అనుచిత వ్యాఖ్యలు
తాజాగా యూపీ ఎంపీ అభ్యర్థి వినయ్ కుమార్ ... ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కైసర్ గంజ్ నుంచి బరిలోకి దిగిన వినయ్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ను గోవులతో పోల్చారు. పాండే కామెంట్లపై దుమారం చెలరేగింది.
గోవులు, ఎద్దులు బంధువులు
'క్రమ శిక్షణ లేని కొన్ని పశువులు దారికి అడ్డంగా నిలబడతాయో .. మోదీ, ఆదిత్యనాథ్ కూడా ఆటంకం కలిగిస్తున్నారు. రోడ్డుమీద వెళ్లేటప్పుడు కొన్ని పశువులు అడ్డంగా నిలబడినట్టు వీరు కూడా అడ్డొస్తున్నారు. గోవులు, ఎద్దులు వీరికి దగ్గరి బంధువులు. గోవులు అక్కాచెల్లెళ్లు, తల్లులు, అత్తలు అవుతాయి' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications