మీకెందుకండీ నోబెల్ బహుమతి- ఏం సాధించారని: ట్రంప్ కు మోదీ షాక్

Donald Trump For Nobel Peace Prize: అత్యున్నత నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకోనున్నారా? ఈ పురస్కారం దాదాపుగా ఆయనకు ఖాయమైనట్టేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. నోబెల్ శాంతి బహుమతికి అడుగు దూరంలో నిలిచారు ట్రంప్. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం కోసం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు.. ఆయన పేరును సిఫారసు చేశారు.

ఈ అవార్డును పొందడానికి ట్రంప్ కు మించిన అర్హులు మరెవరూ లేరని తేల్చి చెప్పారు. నోబెల్ శాంతి బహుమతిని అందుకోవడానికి కావాల్సిన అన్ని అర్హతలు కూడా డొనాల్డ్ ట్రంప్ కు ఉన్నాయని, అందుకే ఆయన పేరును నామినేట్ చేస్తోన్నట్లు ప్రకటించారు. ఇరాన్ అణు సంక్షోభాన్ని నివారించడం, భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నిలిపివేయడం.. వంటి అంశాలను నెతన్యాహు.. ఈ లేఖలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.

Modi s Decision Against Supporting Nobel Prize to Trump

అంతా సవ్యంగా సాగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దీనికి మోకాలడ్డినట్లు తెలుస్తోంది. జూన్ 17న జరిగిన ఫోన్ సంభాషణ ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్నిప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ శాంతి బహుమతికి తన నామినేషన్‌కు మద్దతు ఇవ్వాలని ట్రంప్ ప్రధాని మోదీని కోరారు.

ఈ విజ్ఞప్తిని ప్రధాని మోదీ తిరస్కరించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కాల్పుల విరమణ భారత్, పాకిస్తాన్‌ల మధ్య నేరుగా కుదిరిందని, అమెరికా జోక్యం లేదని మోదీ స్పష్టం చేశారు. ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిని పొందాలనే ప్రయత్నానికి మోదీ నిరాకరించడం రెండు దేశాల సంబంధాలు దెబ్బతినడానికి ప్రధాన కారణమని ఆ నివేదిక తెలిపింది.

ఆ ఫోన్ కాల్‌లో, సైనిక ఉద్రిక్తతలను నివారించినందుకు తాను గర్వపడుతున్నాని ట్రంప్ వెల్లడించారు. పాకిస్తాన్ తనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తుందని, దీని కోసం తాను బహిరంగంగా ప్రచారం చేస్తున్నానని ఆయన మోదీకి తెలిపారు. ఈ వాదనలను మోదీ తోసిపుచ్చారు. భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అమెరికా జోక్యం లేకుండా జరిగిందని, నేరుగా రెండు దేశాలు దీన్ని కుదుర్చుకున్నాయని కుండబద్దలు కొట్టారు.

ఈ ఫోన్ కాల్ జరిగిన కొన్ని వారాల తర్వాత, అమెరికా భారత్‌పై 25 శాతం పరస్పర సుంకాలు విధించింది. రష్యా నుండి రాయితీపై చమురు కొనుగోలు చేసినందుకు న్యూఢిల్లీపై అదనంగా 25 శాతం జరిమానా విధించింది. దీంతో మొత్తం సుంకం 50 శాతానికి పెరిగింది. వాషింగ్టన్, న్యూఢిల్లీల్లో అత్యున్నత స్థాయి అధికారుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ఈ కథనాన్ని ప్రచురించినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. జూన్ 17న జరిగిన ఫోన్ కాల్ తర్వాత ఇద్దరు నాయకులు మళ్లీ సంభాషించుకోలేదని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+