మోడీ వారసుడిగా ఊహించని పేర్లు- చంద్రబాబు, లోకేష్? రాయిటర్స్ బిగ్ షాక్..!

ప్రధానిగా వరుసగా మూడోసారి కొనసాగుతున్న నరేంద్ర మోడీ వారసుడి వేట మొదలైందా ? మోడీకి నాలుగోసారి ప్రధాని అయ్యే అవకాశం లేదా ? ఆయన స్ధానాన్ని ఆక్రమించేందుకు ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న ప్రధాన ప్రత్యామ్నాయాలేంటి ?, వీరిలో ఎవరికి ఎక్కువగా అవకాశం ఉందన్న అంశంపై అంతర్జాతీయ వార్తా ఏజెన్సీ రాయిటర్స్ ఓ విశ్లేషణ చేసింది. అయితే ఇందులో మోడీ వారసుడిగా అవకాశాలు ఉన్న వారిపై రాయిటర్స్ అంచనాలు మాత్రం షాక్ ఇచ్చేలా ఉన్నాయి.

రాయిటర్స్ జర్నలిస్ట్ శ్రితమా బోస్ అంచనా ప్రకారం ప్రస్తుతం మూడోసారి ప్రధానిగా ఉన్న మోడీ.. నాలుగోసారి మాత్రం ఆ పదవిలో ఉండకపోవచ్చు. అయితే ఆయన స్ధానంలో ప్రత్యామ్నాయంగా ప్రధాని కాగలిగే అవకాశం ఉన్న వారిని ఓసారి పరిశీలిస్తే ప్రధానంగా నాలుగు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో ప్రస్తుతం మోడీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న హోంమంత్రి అమిత్ షాతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు.

Modi s Fourth Term Improbable Who Are the PM Successors Emerging in India

వీరిద్దరి తర్వాత మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ఉన్నట్లు రాయిటర్స్ జర్నలిస్ట్ శ్రితమా తెలిపారు. అయితే ప్రధాని మోడీ మాత్రం నాలుగోసారి అవకాశం దక్కించులేకపోవచ్చని, ఇందుకు చాలా కారణాలు ఉన్నట్లు వెల్లడించారు. అదే సమయంలో చంద్రబాబు, లోకేష్ పేర్లు ప్రధాని ఆప్షన్లుగా పేర్కొనడం మాత్రం షాకింగ్ గానే కనిపిస్తోంది.

Modi s Fourth Term Improbable Who Are the PM Successors Emerging in India

బీజేపీలోనే ప్రధాని మోడీ తర్వాత ఆ పదవి కోసం పోటీ పడతారని భావిస్తున్న వారి జాబితా పెద్దదిగానే ఉంది. ఇందులో అమిత్ షా తో పాటు జేపీ నడ్డా, యోగీ ఆదిత్యనాథ్, గడ్కరీ వంటి వారు ఉన్నారు. వీరిలో అమిత్ షా ను మినహాయిస్తే మిగిలిన నేతల పేర్లను రాయిటర్స్ పేర్కొనలేదు. అదే సమయంలో చంద్రబాబు, లోకేష్ వంటి ఎవరూ ఊహించని నేతల పేర్లను ఏకంగా ప్రధాని రేసులోకి తీసుకురావడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+