కోర్టులో పాక్ ఉగ్రవాది నవెద్ (వీడియో)
జమ్మూ: పాకిస్థాన్ లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది మహమ్మద్ నవెద్ యాకూబ్ ను జమ్మూ కాశ్మీర్ లోని చీఫ్ జ్యుడిషియల్ న్యాయస్థానంలో హాజరు పరిచారు. గురువారం ఉదయం కట్టుదిట్టమైన భద్రతతో నవెద్ ను కోర్టు దగ్గరకు తీసుకు వచ్చారు.
ఆ సందర్బంలో నవెద్ ను చూడటానికి స్థానికులు పెద్దఎత్తున తరలిరావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. నవెద్ ను న్యాయస్థానంలో హాజరుపరిచారు. తరువాత న్యాయమూర్తి నవెద్ ను విచారణ చేసి అతని స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు.

ఉదమ్ పూర్ లో జవాన్ల మీద దాడులు చేసిన నవెద్ నుండి వివరాలు సేకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు నావెద్ ను మళ్లి కస్టడిలోకి తీసుకోవాలని భావించారు. మద్యాహ్నం నవెద్ ను మళ్లి కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
ఉదమ్ పూర్ లో నవెద్ బీఎస్ఎఫ్ జావన్ల మీద విరుచుకుపడి బుల్లెట్ ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. నవెద్ నుండి మరన్ని వివరాలు సేకరించడానికి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సిద్దం అయ్యారు.












Click it and Unblock the Notifications