BIHAR ELECTIONS: హత్య కేసులో అరెస్ట్ అయిన అభ్యర్ధి.. కానీ కౌంటింగ్‌లో మాత్రం టాప్ !!

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ వేళ పొలిటికల్ గీత నెక్స్ట్ లెవెల్లో నడుస్తోంది. రెండు దశల్లో జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ( నవంబర్ 14, 2025)కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలు ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 122 స్థానాలు రావాలి. పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే ఎన్డీఏ ముందంజలో ఉండగా, ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపులోనూ అదే జోరు కొనసాగింది.

కాగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం National Democratic Alliance (ఎన్డీయే) కూటమి ముందంజలో దూసుకుపోతుంది. ఎన్డీయే ఇప్పటివరకు 130 స్థానాల్లో ముందుగా ఉండగా.. అధికారాన్ని దక్కించుకునేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 156 స్థానాలను దాటేసింది. దీంతో బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ.. బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పోస్టర్‌ల వార్‌ నడుస్తోంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరినొకరు విమర్శించుకుంటూ పోస్టర్లు ఏర్పాటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

mokama-jdu-candidate-ananth-singh-leading-on-counting-and-news-got-viral

అయితే రాష్ట్రంలోని మోకామా నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనంత్‌ సింగ్‌ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఓ హత్య కేసులో అరెస్ట్ అయిన అనంత్ ప్రస్తుతం ‌జైలులో ఉన్నారు. దీంతో ఆయన గెలుపు ఖాయమంటూ ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. జైలు గేట్లు పగిలిపోతాయి. మన సింహం విడుదలవుతుందని స్లోగన్స్ చేస్తూ సెలబ్రేషన్స్ షురూ చేస్తున్నారు.

కాగా మాజీ ఎమ్మెల్యే అయిన అనంత్‌ సింగ్‌.. జన్‌సురాజ్‌ మద్దతుదారుడు దులార్‌ చంద్‌ యాదవ్‌ హత్య కేసులో ఇటీవల అరెస్టయ్యారు. మోకామా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా దులార్‌ హత్య జరిగింది.

mokama-jdu-candidate-ananth-singh-leading-on-counting-and-news-got-viral

కాగా రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలకు గాను 2616 మంది అభ్యర్థుల బరిలో నిలిచారు. ఏఏ ఎన్నికల లెక్కింపు కోసం 38 జిల్లాల్లో 46 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరికొన్ని గంటల్లో తుది ఫలితం వెల్లడికానుంది. మరోవైపు బీహార్‌లో కౌంటింగ్‌ వేళ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఓట్‌ చోరీ జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఈ మేరకు మాణిక్కం ఠాగూర్‌ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు సంబంధించిన 65 లక్షల ఓట్లు తొలగించారని ట్వీట్‌ చేశారు. ఇంక ఫలితాలు ఏం ఆశిస్తాం అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చారు. మ్యాచ్‌కు ముందే ఫిక్సింగ్‌ జరిగితే ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుంది ట్వీట్ చేశారు. ఇప్పటికే పలుకౌంటింగ్‌ కేంద్రాల దగ్గర నిరసనలు కొనసాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+