బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: 1,500 మంది పోలీసుల ముందు యువతిని ఎం చేశారంటే ?

బెంగళూరులోని ఎంజీ రోడ్డులో నూతన సంవత్సరం వేడుకల సందర్బంగా అర్దరాత్రి మందుబాబులు యువతులతో అసభ్యంగా ప్రవర్థించారని వెలుగు చూసింది. 1,500 మంది పోలీసులు ఉన్నా పీకలదాక మద్యం సేవించి నానాహంగామా చేశార.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్బంగా తనను వేదిస్తున్న అల్లరిమూకల నుంచి రక్షించాలని ఓ యువతి పోలీసులను వేడుకున్నా వారు మాత్రం చూసి చూడనట్లు పట్టించుకోలేదని వెలుగుచూడటంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కరు కాదు ఇద్దరు కాదు 1,500 మంది పోలీసులు కళ్లముందు ఉన్నా అకతాయిలు ఎలా రెచ్చిపోయారో ఈ విషయం తెలిస్తే అర్థం అవుతుంది. బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డులో ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

ఎంజీరోడ్డులో జరిగే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాల నుంచి యువతీ యువకులు వస్తుంటారు. ఆ రోజు ఎంజీ రోడ్డులో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎప్పటిలాగే డిసెంబర్ 31వ తేది రాత్రి ఎంజీ రోడ్డులో 1,500 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.

Molestation: What drunk, unruly men did with girls during News Year’s clebrations in front of 1,500 police men in Bengaluru.

ఆరోజు ఎంజీ రోడ్డులో పీకలదాక మద్యం సేవించిన యువకులు పోలీసులు కళ్ల ముందే అటువైపు వెలుతున్న యువతులతో అసభ్యంగా ప్రవిర్థించారు. వారి వేదింపులు తట్టుకోలేని ఓ యువతి సమీపంలో ఉన్న మహిళా పోలీసుల దగ్గరకు వెళ్లి రక్షించాలని వేడుకున్నారు.

అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో మందుబాబులు మరింత రెచ్చిపోయి యువతిని పట్టుకుని నానా హంగామా చేశారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆ యువతి రక్షించండి అంటూ తన స్నేహితులతో కలిసి అక్కడి నుంచి పరుగు తీసిందని ఓ ఆగ్ల దినపత్రిక సోమవారం కథనం ప్రచురించింది.

మహిళలు, యువతులను రక్షించవలసిన పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరించారని, రక్షించాలని ఆ యువతి వేడుకున్నా పోలీసులు మాత్రం పట్టించుకోలేదని ఆ పత్రిక కథనం ప్రచురించింది. అయితే ఈ విషయంపై బెంగళూరు నగర పోలీసు అధికారులు స్పందించవలసి ఉంది.

English summary
Molestations to passing lewd remarks on women on street, the scenes at Bengaluru's MG Road and Brigade Road were really shocking and shameful. And, all this happened despite the 1,500 policemen deployed in these areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X