ఇద్దరు ప్రియుళ్లతో కలిసి బిడ్డను చంపిన తల్లి

తమ పాప కనిపించడం లేదని తిరువనియూర్ సమీపంలోని అథానికి చెందిన 24 ఏళ్ల మహిళ తన తల్లిదండ్రులతో పాటు వచ్చిన ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. ఆమె ప్రకటనలోని వైరుధ్యాలను గమనించిన పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో ఆమెను ప్రశ్నించడం ప్రారంభించడంతో హత్యకు సంబంధించిన అసలు విషయాలు బయటపడడం ప్రారంభించాయి.
చొట్టినక్కర సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పాప అక్షను తల్లి ప్రియులు రెజిత్ (32) అలియాస్ రంజిత్, బాసిల్ (29) చంపినట్లు బయటపడింది. వారిద్దరు కూడా చట్టినక్కర సమీపంలోని అంబడిమాలకు చెందినవారు. రాణి ఇంట్లో లేని సమయంలో వారిద్దరు ఆ పాపను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
రాణికి రెండేళ్ల కూతురు కూడా ఉంది. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ ఇద్దరు పిల్లలు కూడా అతని సంతానమే. ఏడాది క్రితం అతన్ని వదిలేసి రెజిత్, బాసిల్‌లతో కలిసి ఉంటోంది. వారిద్దరు జెసిబి ఆపరేటర్లు. పాప రాణి తల్లిదండ్రులతో ఉంటోంది. ఆ పాపపై కూడా ఆ ఇద్దరు వ్యక్తులు కన్నేసినట్లు రాణి సూచనప్రాయంగా చెప్పింది.
బాలికపై లైంగిక దాడి జరిగిందా, లేదా అనేది విషయం తేల్చడానికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. తన స్వేచ్ఛకు అడ్డు వస్తుందనే ఉద్దేశంతో పాపను రాణి తన వద్ద ఉంచుకోవడం లేదు. దాంతో బాలిక శవాన్ని పూడ్చిపెట్టడానికి రాణి తన ప్రియులిద్దరికి కూడా సహకరించిందని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications