TMC: మహువా మోయిత్రాపై మనీలాండరింగ్ కేసు నమోదు..
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. క్యాష్ ఫర్ క్వెరీ విచారణలో ఎంపీ మహువా మోయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె పైనే మనీలాండరింగ్ కేసు నమోదు అయింది. భారతీయ శిక్షాస్మృతి (IPC) మరియు అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఇప్పటికే ఈ వ్యవహారంలో నమోదైన CBI FIRను ఆర్థిక దర్యాప్తు సంస్థ పరిగణలోకి తీసుకుంది.
అంతకుముందు మొయిత్రాపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద ఈడీ కేసు నమోదు చేసింది. విచారణకు హాజరు కావాలని ED జారీ చేసిన సమన్లను మొయిత్రా దాటవేసిన కొద్ది రోజుల తర్వాత కేంద్ర ఏజెన్సీ కేసు నమోదు చేసింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘన కేసులో మొయిత్రాతో పాటు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి ఈడీ సమన్లు జారీ చేసింది.

మొయిత్రా గత సంవత్సరం బహిష్కరించిన తర్వాత అదే కృష్ణానగర్ స్థానం నుంచి టీఎంసీ పార్టీ నుంచి పోటీ చేస్తోంది. ఆమె ఈడీ, సీబీఐ "కాషాయ శిబిరానికి రాజకీయ ఏజెంట్లుగా" పనిచేస్తున్నాయని ఆరోపించారు."నన్ను బహిష్కరించడానికి, నన్ను వేధించే కుట్రకు నా విజయం తగిన సమాధానంగా చెబుతుంది" అని ఆమె అన్నారు. లోక్‌సభలో నిక్కచ్చిగా మాట్లాడటం, ఆవేశపూరిత చర్చలకు పేరుగాంచిన మొయిత్రా.. డబ్బలు తీసుకుని ప్రశ్నలు అడిగినట్లు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ నిర్ధారించింది.
ఆమెను లోక్ సభ నుంచి బహిష్కరించింది. విచారణ ఏజెన్సీలు బిజెపిలో అంతర్భాగమని మొయిత్రా ఆరోపించారు. ఎన్నికలకు ముందు తన ప్రచారానికి అంతరాయం కలిగించడానికి, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు బిజెపి సిబిఐ, ఈడిలను ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ మొయిత్రా ఇటీవల ఈసీకిఈ ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఈ విషయంపై పోల్ ప్యానెల్ ఎటువంటి చర్య తీసుకోవడంపై ఆమె సందేహం వ్యక్తం చేసింది.
"ఈసీ ఇప్పుడు తన స్వతంత్రతను కోల్పోయింది. కమిషనర్‌లు ప్రధానమంత్రి, హోంమంత్రి యొక్ మూడింట రెండు వంతుల మెజారిటీచే ఎంపిక అవుతారు " అని ఆమె అన్నారు. అవినీతి నిరోధక అంబుడ్స్‌మెన్ లోక్‌పాల్ ఆదేశాల మేరకు సిబిఐ ఆమె ఆస్తులపై క్యాష్ ఫర్ క్వెరీ కేసుకు సంబంధించి దాడులు నిర్వహించిందని బిజెపి ఎంపి నిషికాంత్ దూబే అన్నారు.












Click it and Unblock the Notifications