తమిళనాడులోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు
చెన్నై:నైరుతి రుతుపవనాలు వెళ్ళిపోయాయి.. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. గతంలో కంటే ఈ ఏడాది మంచి వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.ఆలస్యంగానైనా నైరుతి రుతుపవనాల వల్ల దేశ వ్యాప్తంగా మంచి వర్షాలే కురిశాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావం కూడ మంచి వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు.
దేశంలో ప్రధానంగా నైరుతి రుతుపవనాల వల్లే అత్యధిక వర్షపాతం నమోదౌతోంది. అయితే గత ఏడాది ఈశాన్య రుతుపవనాల కారణంగా చెన్పైలో కురిసిన వర్షాలు అతలాకుతలం చేశాయి.ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించాయని వాతావరణశాఖాధికారులు ప్రకటించారు.వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు ప్రకటించారు.

అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటివారంలో ఈశాన్య రుతపవనాలు వస్తాయి. ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. వీటి ప్రభావంతో రానున్న రోజుల్లో తమిళనాడు, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.
ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఇప్పటికే మొదలైందని అధికారులు చెబుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలోని తిరువయ్యూరులో 7 సెంటిమీటర్లు,వలంగైమన్, పెరంబూర్ లో 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications