వాతావరణం అప్‌డేట్స్: కొంకణ్, గోవా, కేరళ, అసోం, మేఘాలయలలో భారీ వర్ష సూచన
న్యూఢిల్లీ: రుతుపవనాల కారణంగా కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశముంది. సాధారణ రుతు పవనాల కారమంగా కొంకణ్, గోవా, విదర్బష చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లతో పాటు అండమాన్ నికోబర్, అసోంలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి.
నైరుతి రుతుపవనాలు బలహీనపడటం వలన గత వారంగా చురుగ్గా కదలలేదు. అయితే ఈ నెల 24వ తేదీ నుంచి రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం ఈ రుతుపవనాల కాలంలో కొంకణ్, గోవాలలో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కేరళ, కోస్తా కర్ణాకట, మధ్య మహారాష్ట్ర, అసోం, మేఘాలయ, అండమాన్ నికోబర్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
Recommended Video

ఈస్ట్ బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో భారీ గాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన తుఫాను కురుస్తుంది.

కాగా, తెలంగాణలో బుధవారం అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. గురు, శుక్రవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మంగళవారం రాష్ట్రంలో సాధారణం, అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications