మాన్‌సూన్ అప్‌డేట్: తమిళనాడు, కేరళ, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, గోవాలలో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: బలహీనపడిన నైరుతీ రుతుపవనాలు ప్రస్తుతం థానే, ముంబై, అహ్మద్ నగర్, బుల్దానా, గోండియా, తిత్లాఘర్, కటక్, మిడ్నాపూర్, గోల్పారా, బాగ్దోరాల మీదుగా కొనసాగుతున్నాయి.
Recommended Video

సోమవారం నాటి వాతావరణ శాఖ ప్రకారం.. ఎన్ఎల్ఎప్ (నార్తర్న్ లిమిట్ ఆప్ మాన్సూన్స్) థానే, ముంబై, అహ్మద్ నగర్, బుల్దానా, అమరావతి, గోండియా, తిత్లాఘర్, కటక్, మిడ్నాపూర్, గోల్పారా, భాగల్‌కోట్ మీదుగా సాగుతున్నాయి. రుతుపవనాలు బలహీనపడ్డాయి.

ఈ రుతుపవన కాలంలో తమిళనాడు, కేరళ, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, కొంకణ్, గోవా, సిక్కిం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
ఉత్తరాఖండ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమలలో ఉరుములు మెరుపులతో, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
కోస్తాంద్ర, బీహార్‌లోని ఒకటి రెండు ప్రాంతాలు, ఒడిశా, జార్ఖండ్‌లలో వేడి గాలులు ఉంటాయని తెలిపింది.
కాగా, ఉత్తర బీహార్ నుంచి తెలంగాణ వరకు, జార్ఖండ్, ఒడిశా, దక్షిణ చత్తీస్‌గఢ్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంతకుముందు రోజు తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి వర్షాల నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications