వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెదర్ రిపోర్ట్: పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఫిరోజ్‌పూర్, మీరట్, లక్నో, ముజఫర్‌నగర్, పుర్నియా, గౌహతి, తూర్పునాగాలాండ్ మీదుగా రుతుపవనాలు పయనిస్తున్నాయని భాతావర వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.

Recommended Video

2017 కంటే కూడా ఈ ఏడాది వర్షాలు బాగా కురవనున్నాయి: ఐఎండీ

భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపిన వివరాలు ప్రకారం.. సోమవారం రుతుపవనాలు ఉత్తరం వైపు పయనిస్తున్నాయి. హిమాలయాల పాద ప్రాంతాల్లో 34రోజులపాటు రుతుపవనాల కారణంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఫిరోజ్‌పూర్, మీరట్, లక్నో, ముజఫర్‌నగర్, పుర్నియా, గౌహతి, తూర్పునాగాలాండ్ ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉంది.

Monsoon update: Heavy rain likely over West Bengal, Sikkim, Assam and Meghalaya

Monsoon update: Heavy rain likely over West Bengal, Sikkim, Assam and Meghalaya

ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు, బీహార్, పంజాబ్, హర్యానా, ఛండీగఢ్, ఉత్తర హిమాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమబెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Monsoon update: Heavy rain likely over West Bengal, Sikkim, Assam and Meghalaya

ఐఎండీ అంచనాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తర హర్యానా, ఛండీగఢ్, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, కొంకణ్, గోవా, కర్ణాటక తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

English summary
The axis of Monsoon trough is now running across Firozpur, Meerut, Lucknow, Muzaffarpur, Purnea, Guwahati, and towards East Nagaland.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X