మాన్సూన్ అప్‌డేట్: మధ్యప్రదేశ్‌లో అతిభారీ వర్షాలు, అల్పపీడనంతో ఉత్తర, దక్షణాదిలోనూ
న్యూఢిల్లీ: పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, సౌరాష్ట్ర, కొంకణ్ గోవాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Recommended Video

తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక కోస్తా ప్రాంతం, కేరళ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తూర్పు మధ్య ప్రదేశ్, విదర్భ, అస్సాం, మేఘాలయ, కర్ణాటక, తమిళనాడు ఘాట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మధ్యప్రదేశ్ ఈశాన్యం, ఉత్తరప్రదేశ్ ఆగ్నేయ ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రానున్న 48గంటల్లో మధ్య భారతదేశంలో అల్పపీడనం, తుఫానుల కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జులై 21న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

కాగా, కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు రానున్న 24 గంటల్లో కృష్ణా, తుంగభద్ర జన్మస్థలాలైన మహాబలేశ్వరం, అగుంబేల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో కృష్ణా బేసిన్ లోని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.












Click it and Unblock the Notifications