మాన్సూన్ అప్‌డేట్: గోవా, గుజరాత్‌లో అతి భారీ వర్షాలు, తెలంగాణ, ఏపీలో కూడా
న్యూఢిల్లీ: కొంకణ్, గోవా ప్రాంతాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Recommended Video

భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. తూర్పు మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక తీరప్రాంతం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మరఠ్వాడా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఒడిశా ఉత్ర కోస్తా ప్రాంతం, దాని చుట్టూ పక్కల ప్రాంతాల్లో పీడన ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే 48గంటల్లో మధ్య భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉత్తర బంగాళాఖాతంలో జులై 19 ప్రాంతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే మహారాష్ట్ర, గోవాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. రహదారులు జలమయంగా మారాయి.












Click it and Unblock the Notifications