వాతావరణ రిపోర్ట్: బెంగళూరు, కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో వర్షాలు!
Recommended Video

న్యూఢిల్లీ: తాజా వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం.. నైరుతి రుతుపవనాలు కర్ణాటకలో, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. ఇతర కోస్తాంధ్ర ప్రాంతాల్లోను విస్తరించాయి. నైరుతు రుతుపవనాల ప్రభావంతో బెంగళూరుతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో తక్కువ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
రుతుపవనాలు కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలకు విస్తరించాయి. రుతుపవనాల రాక నేపథ్యంలో వర్షాలు కురవనున్నాయి. రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కరువనున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. ఐఎండీ యొక్క ఉపగ్రహ చిత్రం వాతావరణ పరిస్థితులను చూపిస్తుంది.

గోవా, కొంకన్ తదితర ప్రాంతాలలో కమ్ముకున్న సైక్లోన్ క్రమంగా మహారాష్ట్ర, ఉత్తరాది వైపు వెళ్తుంది. కేరళలో రుతుపవనాలు మే 29న తాకాయి. కర్ణాటకను జూన్ 1న తాకాల్సి ఉన్నప్పటికి పలు ఇతర వాతావరణ కారణాలతో మూడు రోజులు ఆలస్యమైంది. రానున్న 48 గంటల్లో తెలంగాణ సహా ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నాయి.
దక్షిణాదిన, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో భారీ వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది రుతు పవనాల కంటే ముందు వర్షాలు నలభై శాతం అధికంగా కర్ణాటకలో ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రైతులకు ఆనందం కలిగిస్తోంది.

కాగా, సోమవారం రుతుపవనాలు ఏపీని తాకినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అనంతపురం జిల్లా మీదుగా ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించినట్టు తెలిపారు. ఇప్పటికే రుతపవనాల ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు. మరోవైపు కర్ణాటక, తమిళనాడులోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి. రుతుపవనాల రాకతో ఏపీలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
-
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
పిడుగులు, భారీ వర్షాలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
బిల్ గేట్స్ వర్షాలను కంట్రోల్ చేస్తున్నారా? 'వార్' ఆన్ వెదర్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications