ఎయిడ్స్: ఇద్దరు కూతుళ్లపై పదేళ్లుగా తండ్రి రేప్

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై ఓ రాక్షస తండ్రి ఉదంతం చోటు చేసుకుంది. మానవత్వం, ఉచ్చనీచాలు మరిచిపోయి ఓ తండ్రి తన ఇద్దరు కూతళ్ల పట్ల దారుణంగా ప్రవర్తించాడు. తనకు ఎయిడ్స్ ఉందని తెలుసు, పైగా కూతుళ్లు, అయినా పదేళ్ల పాటు తన కూతుళ్లపై అత్యాచారం చేశాడు.

ముంబైకి చెందిన ఒక కార్పేంటర్(40)కు భార్య, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నాడు. అయితే గత పదేళ్ల నుంచి తన పెద్ద కూతురిపై తండ్రి అత్యాచారం చేస్తున్నాడు. ఇప్పుడు పెద్ద కూతురు వయస్సు 21 సంవత్సరాలు. మరో 12 ఏళ్ల కూతురు కూడా తండ్రి చేతిలో అత్యాచారానికి గురవుతూనే ఉంది.

విషయం తల్లికి తెలిసినప్పటికీ పరువు పోతుందని బయటకు తెలియనివ్వలేదు. కన్న కూతుళ్లపైనే అత్యాచారం చేయడం ఏమిటని పలుమార్లు భార్య భర్తను ప్రశ్నించింది. దాంతో ఇకనుంచి అటువంటి పని చేయనని కూడా ప్రతిజ్ఞ చేశాడు. అయినా తన తీరు మార్చుకోలేదు. మళ్లీ కూతుళ్లపై అత్యాచారం చేయడం ప్రారంభించాడు.

 Monster Dad Knew He Had AIDS, But Kept Raping His Daughters

తండ్రి అకృత్యాలు భరించలేని ఇద్దరు కూతుళ్లు పొరుగు వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూతుళ్లపై అత్యాచారం చేస్తున్న తండ్రిని పోలీసులు సెప్టెంబర్ 2న అరెస్టు చేశారు. అయితే కార్పేంటర్‌ను వైద్య పరీక్షల నిమిత్తం శతాబ్ధి ఆస్పత్రికి తరలించారు.

వైద్య పరీక్షలలో కార్పేంటర్‌కు ఎయిడ్స్ ఉందని తేలింది. అయితే తనకు ఎయిడ్స్ ఉందని కార్పేంటర్‌కు ముందే తెలుసు. ఎయిడ్స్ ఉందని తెలిసి కూడా కూతుళ్లపై అత్యాచారం చేశాడు. వ్యాధి ప్రాథమిక దశలోనే ఉందని, ఆ విషయం తనకు ఏడాది కింద తెలిసిందని అతను పోలీసులకు చెప్పాడు. తన భార్యకు ఆ వ్యాధి లేదని చెప్పాడు. మొదటి కూతురును అతను 2015లో రేప్ చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+