వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడ్ ఆఫ్ ది నేషన్-బెస్ట్ సీఎం: మమత టాప్, చంద్రబాబు కంటే కేసీఆర్ వెనుకంజ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో చేసిన సర్వేలో దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆమె ఢీకొంటున్నారు. ఆమె ఇటీవల మూడింట బెస్ట్ సీఎంగా నిలిచారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లు 10 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 9 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.

Mood of the Nation Survey: The Didi show, AP CM in Fourth, KCR in Sixth

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 7 శాతంతో నాలుగో స్థానంలో, చత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 5 శాతంతో ఇద్దరు ఐదో స్థానంలో ఉన్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 4 శాతంతో ఉన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 4శాతంతో ఆరో స్థానంలో ఉన్నారు. నవీన్ పట్నాయక్ కూడా ఆరో స్థానంలో ఉన్నప్పటికీ సొంత రాష్ట్రం ఒడిశాలో ఆయన పాపులారిటీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు.

ఆ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి 3 శాతం, అసోం సీఎం శరబానంద సోనోవాల్ 3 శాతం, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ 2 శాతం, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ 2 శాతం, హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టార్ 2 శాతం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 2 శాతం, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ 2 శాతంతో ఉన్నారు.

English summary
Ever since Bihar Chief Minister Nitish Kumar switched sides from the UPA to NDA in July 2017, West Bengal Chief Minister and Trinamool leader Mamata Banerjee has pipped him to become the nations No. 1 chief minister. The feisty Mamata, who offers fierce resistance to Prime Minister Narendra Modi's might, has won the best performing CM thrice in a row, including in August 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X