వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కట్టడి చేయకుంటే క్రెడిబిలిటీకి దెబ్బే: మోడీకి మూడీస్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వివాదాస్పద అంశాలను లేవనెత్తుతున్న భారతీయ జనతా పార్టీ నేతలను కట్టడి చేయడంలో విఫలమైతే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కోల్పోవాల్సి వస్తుందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మూడీస్ భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి హెచ్చరించింది. కేవలం మోడీని చూసి బిజెపి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని స్పష్టం చేసింది.

ఇప్పుడు ఆ పార్టీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు నరేంద్ర మోడీ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయని మూడీస్ అనలిటిక్స్ ‘ఇండియా ఔట్ లుక్: సెర్చింగ్ ఫర్ పొటెన్షియల్' పేరిట విడుదల చేసిన రిపోర్టులో అభిప్రాయపడింది.

 Moody's to PM Narendra Modi: Rein in members or risk losing credibility

ఈ విషయమై మోడీ తక్షణం స్పందించి, తన పార్టీ నేతలను అదుపు చేయాలని, లేకుంటే ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లోనూ గౌరవాన్ని పోగొట్టుకున్న వారవుతారని, తద్వారా బిజెపికి భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవని తెలిపింది.

సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి 7.3 శాతంగా ఉండవచ్చని, పూర్తి ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇంకొంత మెరుగుపడి 7.6 శాతం వృద్ధికి చేరుకోవచ్చని అంచనా వేసింది. భూసేకరణ బిల్లు, జీఎస్టీ వంటి సంస్కరణల అమలులో మోడీ సర్కారు ముందడుగు వేస్తే.. జిడిపి పెరుగుతుందని వెల్లడించింది.

English summary
Against the backdrop of controversies like on beef, Moody's Analytics today cautioned Prime Minister Narendra Modi that the country may lose domestic and global credibility if he doesn't rein in the members of his party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X