ఈ సారి అధిక వర్షపాతమే.. ఏప్రిల్‌లో సాధారణం అని.. ఇప్పుడు ఇలా..
నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయి. కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. నిన్న ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అయితే వర్షపాతానికి సంబంధించి భారత వాతావరణ శాఖ కీలక విషయాన్ని తెలియజేసింది. ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం 103 శాతంగా ఉండనుందని వివరించింది. ఈ సారి అధికంగా వర్షాలు కురిసేందుకు ఛాన్స్ ఉందని తెలిపింది.
అయితే వర్షపాతానికి సంబంధించి ఏప్రిల్ నెలలో ఐఎండీ వెర్షన్ మరోలా ఉంది. అప్పుడు 99 శాతం వర్ష పాతం ఉంటుందని.. సాధారణ వర్షపాతమేనని తెలిపింది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదని చెబుతుంది. దేశవ్యాప్తంగా మంచి వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్రో తెలియజేశారు. మధ్య భారతలో వర్షం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈశాన్య ప్రాంతంలో మాత్రం కాస్త తక్కువగా ఉంటుందని తెలిపింది.

నిన్న ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరు చనిపోగా.. పలువరు గాయపడ్డారు. జమ మసీదు వద్ద డ్యామేజ్ జరిగింది. రహదారులపై భారీ వృక్షాలు నెలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. జనం బిక్కు బిక్కు మని వెళ్లదీశారు. ఇవాళ, రేపు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్ష ప్రభావం ఉండనుంది. ఇప్పటికే కొన్నిచోట్ల వాతావరణం చల్లబడింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications