ప్రధాని మోడీకి లేఖ రాసిన కోటి మంది బాలలు: విదేశాల నుంచి కూడా

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సంవత్సరంలో ఇదే తొలి రేడియో ప్రసంగం. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను ప్రస్తావించారు. కొత్త ఆశలతో 2022లో అడుగు పెట్టామని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ పుణ్యతిథి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. నివాళి అర్పించారు. స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.

పద్మశ్రీ అవార్డులను పొందిన సామాన్యుల పేర్లను ప్రధాని తన ప్రసంగంలో ఉటంకించారు. కర్ణాటకకు చెందిన అమై మహాలింగ నాయక్ సహా పలువురు సామాన్యలు సమాజానికి చేసిన సేవలను ప్రస్తావించారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలొడ్డి.. గుర్తింపు లేకుండా పోయిన వీరులను స్మరించుకుంటున్నామని చెప్పారు. వారంతా అన్ సంగ్ హీరోలని మోడీ అన్నారు. వారందరికీ నివాళి అర్పించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని మోడీ గుర్తు చేశారు.

More than one crore children have sent me their Mann Ki Baat via postcard: PM Modi

దేశవ్యాప్తంగా కోటిమందికి పైగా పిల్లలు తనకు లేఖలు రాశారని ప్రధాని మోడీ వెల్లడించారు. మన్ కీ బాత్‌లో ప్రస్తావించాల్సిన అంశాల గురించి వివరించారని పేర్కొన్నారు. ఆ ఉత్తరాల్లో ఎంపిక చేసిన కొన్నింటి సారాంశాన్ని ప్రధాని మోడీ ఈ సందర్భంగా చదివి వినిపించారు.
అస్సాం, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, గోవా ఇతర రాష్ట్రాల నుంచి తనకు ఉత్తరాలు అందాయని పేర్కొన్నారు. ఈ లేఖలు రాసిన వారంతా అవినీతి రహిత భారత్‌ను కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

అవినీతిని నిర్మూలించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. క్రొయేషియా నుంచి కూడా తనకు లేఖలు అందాయని చెప్పారు. విద్య, వైద్యాన్ని బలోపేతం చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని మోడీ చెప్పారు. అమర్ జవాన్ జ్యోతి గురించి కూడా వేలాదిమంది తనకు లేఖలు రాశారని పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రకటించిన బాల పురస్కారాలు, పద్మ అవార్డులను సామాన్యలకు ప్రదానం చేయడాన్ని ప్రశంసించారని చెప్పారు.

ఇప్పటిదాకా నాలుగున్నర కోట్ల మంది 15-18 సంవత్సరాల్లోపు పిల్లలు కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నారని ప్రధాని పేర్కొన్నారు. అలాగే- కోటిమందికి పైగా బూస్టర్ డోసులను వేసుకున్నారని చెప్పారు. జనాభాలో 75 శాతం మంది పెద్దలు కరోనా వైరస్ టీకాలను వేసుకున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఈ స్థాయిలో వ్యాక్సినేషన్‌ను కొనసాగించామని వ్యాఖ్యానించారు. దీన్ని విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+