న్యూఇయర్ ఎఫెక్ట్, శబరిమలకు బారులు తీరిన భక్తులు, ఒక్కరోజు ఎంత మంది అంటే, మకరజ్యోతికి !
భారతదేశంలోని చాలా శాతం మంది సోమవారం నూతన సంవత్సర వేడుకలు వివిద రకాల్లో జరుపుకుని ఆ సంబరాల్లో మునిగిపోయారు. ఇక హిందువలకు ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం శబరిమల ఆలయానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. అయ్యప్ప స్వామి దర్శనంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించేందుకు అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లారు.
అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందేందుకు భక్తులు సోమవారం ఉదయం నుంచి అర్దరాత్రి వరకు బారులు తీరిన దృశ్యాలు సర్వసాధారణం అయ్యాయి. 18 మెట్లు ఎక్కడానికి లక్షలాది మంది అయ్యప్ప భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. కొత్త సంవత్సరం నాడు ఉదయం 10 గంటల నుండి అర్దరాత్రి 12 వరకు అయ్యప్ప భక్తులు క్యూలైన్లలో నిలబడి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. జనవరి 1వ తేది నూతన సంవత్సరం సందర్బంగా శబరిమలకు అయ్యప్ప భక్తులు బారులుతీరారు.

నూతన సంవత్సర వీకెండ్ మరుసటి రోజు రావడంతో శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అయ్యప్ప దర్శనం కోసం ఉదయం నుంచి వేలాది మంది భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శబరిమల సీజన్ ప్రారంభం కావడంతో అయ్యప్ప భక్తులు పతనంతిట్టవైపు బయలుదేరారు. ఇక మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి అయ్యప్ప భక్తులకు దర్శనం ఇస్తోంది. మకరజ్యోతి ఉత్సవాలకు శబరిమల ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అయ్యప్పకు 18,018 కొబ్బరి నెయ్యితో అభిషేకం చేయించారు. బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు అయ్యప్ప స్వామికి 18,018 కొబ్బరి నెయ్యితో అభిషేకం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా బెంగళూరు నుంచి వచ్చిన ఉన్నికృష్ణన్ అనే భక్తుడు 18,018 కొబ్బరి నెయ్యితో అయ్యప్పకు అభిషేకం చేశారు. సన్నిధానం దగ్గర కొబ్బరికాయలు పేర్చి వాటిని పగలగొట్టి పెద్ద పాత్రలో నెయ్యి సేకరించి అభిషేకానికి తీసుకెళ్లారు.

మకరజ్యోతిని దర్శించడానికి లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు చేరుకోవడానికి సిద్దం కావడంతో అదనపు ఫారెస్ట్ గార్డ్ లను ఏర్పాటు చేస్తున్నారు. మకర జ్యోతి సందర్భంగా అయ్యప్ప భక్తులకు సహాయం చేయడానికి అదనపు ఫారెస్ట్ గార్డులను నియమించారు. వీరితో పాటు పాములు పట్టేవారు, ఏనుగుల హ్యాండ్లర్లు, ఫారెస్ట్ గార్డులు, అంబులెన్స్ సర్వీస్, భక్తులకు తాగునీరు, బిస్కెట్లు అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు.
పుల్మేడు-సన్నిధానం మార్గాల్లో ప్రత్యేక రెస్క్యూ బృందాలను నియమించారు. మకరజ్యోతి దర్శనానికి ముందు అడవుల్లో గుడిసెలు వేసుకోవడం మానుకోవాలని అటవీశాఖ అధికారులు అయ్యప్ప భక్తులకు మనవి చేశారు. శారీరక సమస్యలున్నవారు, చిన్నపిల్లలు, వృద్ధులు అటవీ మార్గాన్ని ఎంచుకోకూడదని, శబరిమలకు వెళ్లే రోడ్డు మార్గాలన్నీ అడవిలోనే ఉన్నందున ప్రతి భక్తుడు సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. అంతేకాకుండా శబరిమల వద్ద రద్దీని నియంత్రించేందుకు, భక్తులకు సహాయం చేసేందుకు కేరళ ప్రభుత్వ ఆదేశం మేరకు 100 మంది వాలంటీర్లను నియమించినట్లు శబరిమల ఆలయ నిర్వాహకుడు అయిన కృష్ణకుమార్ మీడియాకు తెలిపారు.












Click it and Unblock the Notifications