పరిచయస్తులే మహిళలను కాటేస్తున్నారు.. రేప్ కేసుల్లో నివ్వెరపోయే నిజాలు
న్యూఢిల్లీ : దేశంలో మహిళలపై చోటు చేసుకుంటున్న చాలా మట్టుకు అఘాయిత్యాలు పరిచయస్తుల నుంచే ఎదుర్కోవాల్సి రావడం దిగ్బ్రాంతికి గురిచేస్తోన్న అంశం. నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు తాజాగా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.
క్రైమ్ బ్యూరో నివేదిక ప్రకారం.. 2014లో మహిళలపై నమోదైన లైంగిక దాడి కేసుల్లో 50 శాతం మంది నిందితులు బాధిత మహిళలకు ఇరుగు పొరుగున ఉండేవారే ఉన్నారు. ఇక 2016లో దేశవ్యాప్తంగా నమోదైన అత్యాచార కేసుల్లో ఎక్కువ మంది నిందితులు సదరు బాధిత మహిళలకు పరిచయస్తులే అని తేలడం విస్మయానికి గురిచేస్తోంది.

మరో వాస్తవమేంటంటే.. దేశంలో మహిళలకు బయటి ప్రపంచంలోనే కాదు ఇంట్లోనే భద్రత లేకుండా పోవడం. ముఖ్యంగా కుటుంబ సభ్యలైన మామ, తండ్రి, ఇతర మగవాళ్ల నుంచి మహిళలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ కుటుంబ సభ్యుల చేత అత్యాచారానికి గురైతే ఆ విషయాలు బయటకొచ్చి చెప్పుకునే పరిస్థితి కూడా లేదు.
ఇదే విషయాన్ని ఓ మహిళా కార్యకర్త వెల్లడించారు. ఇకపోతే యుక్త వయసులో ఉన్న మహిళలకు లైంగిక వేధింపుల పట్ల ఎలా స్పందించాలో తెలియక సతమతమవుతున్నారని డీపీఎస్ బొకరా డైరెక్టర్ హేమలతా ఎస్ మోహన్ తెలిపారు. ఇలాంటి విషయాల్లో కుటుంబ సభ్యులు పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications