కసాయి తల్లి: ఆడబిడ్డ వద్దని గొంతు కోసి చంపేసింది
జైపూర్: మగ సంతానం కోసం ఓ మాతృమూర్తి తాను జన్మనిచ్చిన ఆడ శిశువును అతిదారుణంగా చంపేసిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. 9 నెలలు మోసి జన్మనిచ్చిన ఆడబిడ్డను కిరాతకంగా హత్య చేసిన తల్లిని పోలీసులు అరెస్టు చేశారు.
జైపూర్ లో నేహా గోయల్ (35) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈమెకు 8 సంవత్సరాల కుమార్తె ఉంది. మగ బిడ్డకావాలని నేహా గోయల్ అనేక పూజలు చేసింది. ఐవీఎఫ్ చికిత్స చేయించుకుంది.
అయితే నాలుగు నెలల క్రితం మళ్లీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తనకు మగబిడ్డ పుట్టలేదని, ఆడబిడ్డ పుట్టిందని విరక్తి పెంచుకుంది. నిరాశ చెందిన నేహా గోయల్ ఆగస్టు 26వ తేదిన కత్తి తీసుకుని నాలుగు నెలల కుమార్తె గొంతు కోసి కిరాతకంగా హత్య చేసింది.

తరువాత పాప కనపడటం లేదని కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబ సభ్యులు పాప కోసం గాలించారు. చివరికి తుప్పుపట్టిన మిషన్ లో బాలిక మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. కుమార్తె హత్యకు గురైయ్యిందని నేహా గోయల్ లో ఎలాంటి బాధ లేదని గుర్తించిన పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేశానని అంగీకరించిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications