బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Metro pillar: బైక్ మీద కుప్పకూలిపోయిన మెట్రో రైల్ పిల్లర్, తల్లీ కొడుకు ప్రాణాలు, ఏం జరిగిదంటే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రతిరోజు భార్యను పని చేస్తున్న కంపెనీలో వదిలిపెడుతున్న భర్త తరువాత కొడుకును బేబీ సిట్టింగ్ స్కూల్ లో వదిలిపెట్టి తరువాత భర్త ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్నాడు. ఎప్పటిలాగే భర్త బైక్ లో భార్యను కంపెనీ దగ్గర డ్రాప్ చెయ్యడానికి ఇద్దరు కుమారులను పిలుచుకుని బయలుదేరాడు. మార్గం మద్యలో నిర్మాణంలో ఉన్న మెట్రో రైలు పిల్లర్ దంపతులు వెలుతున్న బైక్ మీద కుప్పకూలిపోయింది. వెనుక వెలుతున్న ప్రయాణికులు హడలిపోయారు. మెట్రో పిల్లర్ తొలగించి తీవ్రగాయాలైన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

Wife: లవ్ మ్యారేజ్, నిద్రపోతున్న భర్త ?, కుర్రాడు బాబోయ్ గుర్రమెక్కినాడే అంటూ, 10 ఏళ్లు చిన్నోడిడో ?Wife: లవ్ మ్యారేజ్, నిద్రపోతున్న భర్త ?, కుర్రాడు బాబోయ్ గుర్రమెక్కినాడే అంటూ, 10 ఏళ్లు చిన్నోడిడో ?

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

బెంగళూరు నగరంలోని నాగరవ సమీపంలో లోహిత్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. లోహిత్ కుమార్ కు తేజస్విని అనే భార్య ఉంది, తేజస్విని, లోహిత్ కుమార్ దంపతులకు విహాన్ (2), విస్మిత్ (4) అనే కుమారులు ఉన్నారు. లోహిత్ కుమార్ సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. లోహిత్ కుమార్, తేజస్వి దంపతులు వారి ఇద్దరు కుమారులతో చాలా సంతోంగా జీవిస్తున్నారు.

మాన్యతా టెక్ పార్క్ లో ఉద్యోగం

మాన్యతా టెక్ పార్క్ లో ఉద్యోగం

లోహిత్ కుమార్ భార్య మాన్యతా టెక్ పార్క్ లోని ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ప్రతిరోజు భార్య తేజస్వినిని ఆమె పని చేస్తున్న మాన్యతా టెక్ పార్క్ లోని కంపెనీలో వదిలిపెడుతున్న లోహిత్ కుమార్ తరువాత కొడుకు విస్మిత్ ను బేబీ సిట్టింగ్ స్కూల్ లో వదిలిపెట్టి తరువాత అతను ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్నాడు. ఎప్పటిలాగే బైక్ లో భార్య తేజస్విని, ఇద్దరు కుమారులను పిలుచుకుని లోహిత్ కుమార్ మంగళవారం ఉదయం బైక్ లో బయలుదేరాడు.

కుప్పకూలిపోయిన మెట్రో పిల్లర్

కుప్పకూలిపోయిన మెట్రో పిల్లర్

కల్యాణ్ నగర్/ హెచ్ఆర్ బీఆర్ లేఔట్ మార్గం మధ్యలో (టిన్ ఫ్యాక్టరీ-హెబ్బాళ రింగ్ రోడ్డు)లో మెట్రో రైలు పనులు జరుగుతున్నాయి. లోహిత్ కుమార్ అతని కుటుంబ సభ్యులుబైక్ లో వెలుతున్న సమయంలో మెట్రో రైల్ పిల్లర్ నిర్మించడానికి ఏర్పాటు చేసిన పిల్లర్ ఒక్కసారిగా లోహిత్ కుమార్ వెలుతున్న బైక్ మీద కుప్పకూలిపోయింది. మెట్రో పిల్లర్ కుప్పకూలడంతో లోహిత్ కుమార్, తేజస్విని దంతులతో పాటు వారి ఇద్దరు పిల్లలు కింద చిక్కుకుపోయారు.

 తల్లీ కొడుకు ప్రాణం పోయింది

తల్లీ కొడుకు ప్రాణం పోయింది

మెట్రో రైలు పనులు చేస్తున్న కార్మికులు, ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూలిపోయిన మెట్రో పిల్లర్ ను తొలగించి లోహిత్ కుమార్, తేజస్విని దంపతులతో పాటు వారి ఇద్దరి కుమారులను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తేజస్విని, ఆమె కుమారుడు విహాన్ (2) ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ప్రమాదంలో గాయపడిన తేజస్విని భర్త లోహిత్ కుమార్, వారి పెద్ద కుమారుడు విస్మిత్ తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఇద్దరు చికిత్సకు సహకరిస్తున్నారని బెంగళూరు ఈస్ట్ డీసీపీ మీడియాకు చెప్పారు.

ఏం జరిగింది ?

ఏం జరిగింది ?

మెట్రో పిల్లర్ కు ఏర్పాటు చేసిన ఇనుప రాడ్లు ఓవర్ లోడ్ కావడం వలనే అది కుప్పకూలిపోయిందని అధికారులు అంటున్నారు. నిర్లక్షంగా మెట్రో పనులు చెయ్యడమే కాకుండా వాటి కింద వాహన సంచారానికి అనుమతి ఇవ్వడం వలనే తల్లీ కొడుకు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ప్రజలు మండిడుతున్నారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ సీనియర్ విభాగం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మెట్రో రైల్ పిల్లర్ ఎలా కుప్పకూలింది అని విచారణ చేస్తున్నారు.

English summary
Mother and son killed after Metro rail pillar collapses on bike, father and son fear for their lives near Nagavara in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X