మనమడిని ఇవ్వు.. లేదంటే రూ.5 కోట్లు ఇవ్వు.. కోర్టులో ఓ తల్లి పిటిషన్
ఈ రోజుల్లో వింత కేసులు ఫైల్ అవుతున్నాయి. కోర్టుల్లో పిటిషన్లు కూడా వేస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా అవీ మాత్రం నిజం. ఇటీవల ఓ తల్లి తన కుమారుడు, కోడలిపై కేసు వేసింది. కేసు అంటే అదేదో క్యాజువల్ కేసు కాదు.. తనకు మనమడిని ఇవ్వాలని కోరింది. లేదంటే పరిహారంగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఉత్తరాఖండ్ హరిద్వార్ సివిల్ కోర్టులో ఈ కేసు ఫైల్ చేసింది.

పెళ్లయి ఆరేళ్లు అవుతున్నా..
హరిద్వార్‌కు చెందిన యువకుడికి 2016లో పెళ్లయ్యింది. ఆరేళ్లు అవుతున్న ఇప్పటివరకు పిల్లలు లేరు. కోడలు కాపురం హైదరాబాద్‌కి మార్చింది. ఇంకేముంది కొడుకు తమ వద్ద లేరనే బెంగ ఉంది. దాంతోపాటు అతని జీతం అంతా కోడలు, వారి ఫ్యామిలీ తీసుకుంటుందట. పెళ్లయి ఆరేళ్లు అయినా వారికి సంతానం లేదు. ఏదైనా ఆస్పత్రిలో చూపిద్దామని అనుకుంటే దగ్గర లేకపాయే.. ఇంకేముంది నలిగిపోయిన ఆ తల్లి కోర్టులో పిటిషన్ వేశారు. తనకు మనమడిని ఇవ్వాలని కోరారు. లేదంటే రూ.5 కోట్లు తనకు పరిహారం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.

హనీమూన్ కూడా పంపా.. కానీ
తన కుమారుడి చదువు కోసం చాలా ఖర్చు చేశానని ఆ తల్లి పేర్కొన్నారు. అతను మంచి పైలట్ అయ్యేందుకు ఎక్కువ ఖర్చు అయ్యిందని చెప్పారు. పెళ్లి కూడా ఘనంగా జరిపానని చెప్పారు. మ్యారేజ్ అయ్యాక వారిని తన నగదుతో హానీమూన్ పంపానని తెలిపారు. థాయ్‌లాండ్ పంపించానని ఆ తల్లి పిటిషన్‌లో పేర్కొందని ఆమె తరఫు లాయర్ ఏకే శ్రీవాత్సవ మీడియాకు చెప్పారు. పెళ్లయిన తర్వాత మార్పు కనిపించిందని తెలిపారు. తమను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

హైదరాబాద్ షిప్ట్
పెళ్లి తర్వాత హైదరాబాద్ షిప్ట్ అయ్యారని చెప్పారు. తమ బాగోగులు చూడటం లేదని వివరించారు. తన కోడలు కుటుంబం తమ కుమారుడిని అదుపులో ఉంచుకున్నారని తెలిపారు. అతని జీతం తీసుకుంటూ.. కూతురి నిర్ణయాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ తల్లి పిల్‌పై కుమారుడు, కోడలు వెర్షన్ ఎలా ఉండనుందో చూడాలీ. కానీ ఇదీ మాత్రం చిత్రమైన కేసు.. ఇదివరకు ఎవరు కూడా ఇలాంటి కేసు నమోదు చేయలే. కేసులో కోడలు, కుమారుడు వాదనలు కీలకం కానున్నాయి.












Click it and Unblock the Notifications