లేడీ టెక్కీ: క్షణికావేశంలో మూడో అంతస్తు నుంచి బిడ్డను తోసి చంపేసింది, భర్తకు దూరంగా !

క్షణికావేశంలో కన్న తల్లి మూడో అంతస్తు నుంచి కుమార్తెను కిందకు తోసి హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలోని పుట్టేణహళ్ళి ప్రాంతంలో జరిగింది. జరగనహళ్ళిలో నివాసం ఉంటున్న సాక్షి కాంచన్ సర్కార్ అనే మహిళ తన కుమార

బెంగళూరు: క్షణికావేశంలో కన్న తల్లి మూడో అంతస్తు నుంచి కుమార్తెను కిందకు తోసి హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలోని పుట్టేణహళ్ళి ప్రాంతంలో జరిగింది. జరగనహళ్ళిలో నివాసం ఉంటున్న సాక్షి కాంచన్ సర్కార్ అనే మహిళ తన కుమార్తె శ్రేయా సర్కార్ (9)ను హత్య చేసింది.

పశ్చిమ బెంగాల్ కు చెందిన సాక్షి కాంచన్ బెంగళూరు చేరుకుని హెచ్ పీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నది. సాక్షి, కాంచన్ సర్కార్ వివాహం చేసుకున్నారు. సాక్షి, కాంచన్ సర్కార్ కుమార్తె శ్రేయా సర్కార్. రెండు సంవత్సరాల నుంచి సాక్షి, కాంచన్ సర్కార్ మధ్య విభేదాలు తలెత్తడంతో వేరువేరుగా నివాసం ఉంటున్నారు.

 Mother pushes her daughter to death in Bengaluru

ప్రతినెల కాంచన్ సర్కార్ కుటుంబ పోషణకోసం భార్య సాక్షికి డబ్బులు ఇస్తున్నాడని పోలీసులు చెప్పారు. ఆదివారం శ్రేయను భోజనం చెయ్యాలని ఆమె తల్లి సాక్షి చెప్పింది. తనకు ఆకలిగా లేదని శ్రేయ చెప్పింది. ఆ సమయంలో తాను చెప్పింది చెయ్యాలని సాక్షి కుమార్తె శ్రేయ మీద మండిపడింది.

ఆ సందర్బంలో క్షణికావేశంలో ఇంట్లో ఏడుస్తున్న శ్రేయను బయటకు లాక్కోచ్చి మూడో అంతస్తు నుంచి కిందకు తోసేసింది. తరువాత సాక్షి కూడా మూడో అంతస్తు నుంచి కిందకుదూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంతో స్థానికులు ఆమెను రక్షించి పోలీసులకు అప్పగించారు. చిన్న విషయానికి సహనం కోల్పోయిన సాక్షి ఆమె కుమార్తె శ్రేయను మూడో అంతస్తు నుంచి కిందకు తోసి వేయడంతో తీవ్రగాయాలై మరణించిందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+