ఒకే వేదికపై , ఒకే ముహూర్తానికి కూతురి పెళ్ళితో పాటు తల్లి పెళ్లి .. అరుదైన ఘట్టం

ఓకే వివాహ వేదిక పై, ఒకే ముహూర్తానికి తల్లి, అలాగే కూతురు తమ జీవిత భాగస్వామిని ఎంచుకొని వివాహం చేసుకోవడం ఆశ్చర్యకరంగా అనిపించినా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. యూపీలోని గోరక్ పూర్ లో అలాంటి అసాధారణమైన వివాహం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది . 53 ఏళ్ల మహిళ, ఆమె 27 ఏళ్ల కుమార్తె ఒకే మండపంపై తమ భాగస్వాములతో వివాహ ప్రమాణాలను చేసి ఏడడుగులు నడిచారు.

 ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన కార్యక్రమంలో కూతురితో పాటు పెళ్లి చేసుకున్న తల్లి

ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన కార్యక్రమంలో కూతురితో పాటు పెళ్లి చేసుకున్న తల్లి


గోరఖ్‌పూర్‌లోని పిప్రౌలి బ్లాక్‌లో ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన కార్యక్రమంలో భాగంగా ఒకే సామూహిక వివాహ వేదికలో చాలామంది జంటలకు వివాహాలు జరిపించారు . ఈ వేడుకలో ఒక మహిళ, ఆమె కుమార్తె ఇద్దరూ ఒకే ముహూర్తంలో వివాహం చేసుకున్నారు.
వితంతువు అయిన ఆ మహిళ తన భర్త యొక్క తమ్ముడిని వివాహం చేసుకుంది .ఆమె సామూహిక వివాహాలు జరిగిన 63 జంటలలో ఒక జంట. తల్లీ , కూతుర్లు ఒకే వివాహ వేదికపై వివాహం చేసుకోవటం అక్కడ హాట్ టాపిక్ అయింది.

 53 ఏళ్ళ బెలీ దేవి తోడు కోసం తన భర్త సోదరుడితో పెళ్లి

53 ఏళ్ళ బెలీ దేవి తోడు కోసం తన భర్త సోదరుడితో పెళ్లి

బెలీ దేవి అనే మహిళ హరిహర్‌ను వివాహం చేసుకున్నారు . ఆమెకు ముగ్గురు కుమార్తెలు , ఇద్దరు కుమారులు ఉన్నారు. 25 సంవత్సరాల క్రితం బెలీ దేవి భర్త హరిహర్ మరణించారు . అప్పటి నుండి బెలీ దేవిపిల్లల్ని కష్టపడి పెంచింది . ఇప్పుడు, ఆమె పిల్లలందరూ పెద్దవారు కదా చిన్న కుమార్తె హిందూ వివాహం మినహా అందరికీ వివాహాలు కూడా జరిగాయి. అందరూ ఎవరికి వారు స్వంత కుటుంబాలతో స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే బేలి దేవి తన జీవితాంతం తనకు తోడుగా ఉండడం కోసం తన భర్త సోదరుడైన జగదీష్, 55 ను వివాహం చేసుకున్నారు.

కుమార్తె పెళ్లి ముహూర్తానికే ఆ వేదిక మీదే తల్లి పెళ్లి .. కొత్త అధ్యాయానికి శ్రీకారం

కుమార్తె పెళ్లి ముహూర్తానికే ఆ వేదిక మీదే తల్లి పెళ్లి .. కొత్త అధ్యాయానికి శ్రీకారం

గోరక్ పూర్ లో నిర్వహించిన సామూహిక వివాహ వేడుకలో ఆమె కుమార్తె ఇందూ (27) వివాహంతో పాటుగా, తల్లి బెలీ దేవి వివాహం కూడా జరిగింది.
తన భర్త సోదరుడు ఒంటరి వాడని , 55 సంవత్సరాల వయసు వచ్చినా పెళ్లి చేసుకోలేదని పేర్కొన్న బెలీ దేవి తన చిన్న కుమార్తె పెళ్లితో పాటు, తాను కూడా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. నా పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు . ఈ సమయంలో తాను కూడా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని ఆశ పడుతున్నానని సంతోషంగా చెప్పారు.

 తమ కుటుంబం అంతా తల్లి పెళ్ళికి ఓకే చెప్పిందన్న బెలీదేవి కుమార్తె .. నిజంగా గొప్ప విషయం

తమ కుటుంబం అంతా తల్లి పెళ్ళికి ఓకే చెప్పిందన్న బెలీదేవి కుమార్తె .. నిజంగా గొప్ప విషయం

బెలీ దేవి చిన్న కుమార్తె ఇందూ 29 ఏళ్ల రాహుల్‌ను వివాహం చేసుకుంది. వివాహంపై స్పందించిన ఇందూ తన తల్లి పెళ్లి విషయంలో తమ కుటుంబంలో ఎవరికీ అభ్యంతరం లేదని, చిన్నప్పటి నుంచీ తన తల్లి ఎంతో కష్టపడి తమని పెంచిందని, ఇప్పుడు ఆమె సంతోషంగా ఉండటమే అందరము కోరుకుంటున్నామని చెప్పారు. 53ఏళ్ల వయసులో బెలీ దేవి వివాహం చేసుకోవడం కాస్త వింతగా అనిపించినా, ఆమె వివాహాన్ని పిల్లలందరూ కలిసి మనస్ఫూర్తిగా అంగీకరించడం, కూతురి వివాహంతో పాటు , తల్లి కూడా వివాహం చేసుకోవడం మాత్రం నిజంగా గొప్ప విషయమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+