కారు దూసుకెళ్లి నిద్రపోతున్న తల్లి, కుమారుడి మృతి
చండీగఢ్: వేడి గాలి ఎక్కవగా ఉండటంతో ఇంటి ముందు నిద్రపోతున్నతల్లి, కుమారుడి మీద నిర్లక్ష్యంగా కారు నడపడంతో ఇద్దరూ మృతి చెందిన సంఘటన హర్యానాలో జరిగింది. హర్యానాలోని హిసార్ లో గురువారం రాత్రి జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హిసార్ లోని పెహల్వాన్ చౌక్ దగ్గర రాణి (45) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈమె కుమారుడు వివేక్(21). గురువారం రాత్రి వేడి గాలి ఎక్కువగా ఉండటంతో రాణి కుమారుడు వివేక్ తో కలిసి ఇంటి బయటకు వచ్చి నిద్రపోయారు.

అర్దరాత్రి సమయంలో సమీపంలోనే నివాసం ఉంటున్న జస్ దీప్ సందూ అనే వ్యక్తి తన ఎస్ యువీ కారులో అటు వైపు వేగంగా వచ్చాడు. రాణి, అతని కుమారుడి మీద కారు నడిపాడు. ఆ సమయంలో చక్రాలు వారి మీద దూసుకు వెళ్లాయి.
తల్లి, కుమారుడు ఇద్దరు నిద్రలోనే ప్రాణాలు వదిలి పెట్టారు. కారు అదుపుతప్పి సందూ ఇంటినే ఢీకొంది. ఇల్లు దెబ్బతింది. కారును వదిలేసి సందూ అక్కడి నుండి పరారైనాడు. శుక్రవారం పోలీసులు సందూను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications