వరదల్లో కొట్టుకుపోయిన గ్రామం, తల్లి, కొడుకుల మృతదేహాలు, డ్రోన్ లతో సైనికులు!
మడికేరి (కర్ణాటక): కర్ణాటకలోని మడికేరి సమీపంలోని వరదల్లో గ్రామం మొత్తం కొట్టుకుపోవడంతో గల్లంతు అయిన తల్లీ, కుమారుడి మృతదేహాలను సైనికులు గుర్తించారు. వరద నీటిలో కొట్టుకుపోయిన హెమ్మత్తాల్ గ్రామానికి చెందిన చంద్రావతి (66), ఆమె కుమారుడు ఉమేష్ (26) మృతదేహాలను గుర్తించిన సైనికులు ఆసుపత్రికి తరలించారు.
కొడుగు జిల్లాలోని మడికేరిలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలతో ఆ పరిసర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. మడికేరి తాలుకాలోని హెమ్మత్తాల్ గ్రామంలోని ఇండ్లు కుప్పకూలిపోయాయి. చంద్రావతి, ఉమేష్ నివాసం ఉంటున్న ఇల్లు పూర్తిగా వరదల్లో కొట్టుకుని పోయింది.

మూడు రోజుల క్రితం ఇంటితో సహ వరదల్లో కొట్టుకునిపోయిన చంద్రావతి, ఉమేష్ ల కోసం సైనికులు గాలించారు. బుధవారం హెమ్మత్తాల్ గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో చంద్రావతి, ఉమేష్ మృతదేహాలను సైనికులు గుర్తించడంతో వారి కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేశారు.
Recommended Video

హెమ్మత్తాల్ గ్రామంలో మొత్తం 40 ఇండ్లు ఉన్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా గ్రామంలోని అన్ని ఇండ్లు కొట్టుకుని పోయాయి. సైనికులు, సహాయక సిబ్బంది, రెస్యూ టీం సభ్యులు అనేక మంది గ్రామస్తులను ప్రాణాలతో కాపాడారు. 72 వృద్దురాలితో సహ ఆరు మంది ఇప్పటికీ గల్లంతు అయ్యారు. గల్లంతు అయిన వారి కోసం డ్రోన్ ల సహాయంతో సైనికులు గాలిస్తున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications