45 రోజుల పసికందును గొంతు కోసి చంపిన కన్నతల్లి.. కారణం తెలిస్తే షాక్ !
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని అహిర్‌ఖేడి ప్రాంతంలో సమాజాన్ని షాక్‌లోకి ముంచేసిన ఘటన చోటుచేసుకుంది. 45 రోజుల పసికందును కన్న తల్లి అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగిందంటే..?
స్థానికంగా సన్నీ సోలంకి, నేహా దంపతులు నివసిస్తున్నారు. నేహా ఇంట్లో ఒంటరిగా ఉన్న బాబును పదునైన ఆయుధంతో దాడి చేసి చంపింది. దాడికి తరువాత, బయట బట్టలు ఉతుకుతున్న తన ఆడపడుచును పిలిచి, "బాబుకు ఏదో అయింది" అని కేకలు వేసింది. తమ ఆడపడుచు ఇంట్లోకి వచ్చి రక్తమడుగులో పడి ఉన్న ప్రియాంశ్‌ను చూసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించింది.

కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నేహా చేతులపై రక్తపు మచ్చలు గమనించి ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రాథమిక విచారణలో నేహా తన నేరాన్ని అంగీకరించింది. అదనపు డీసీపీ విశేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. నేహా తీవ్ర డిప్రెషన్లో ఉందని.. గతంలో కూడా బాబు గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయని బంధువులు తెలిపారని అన్నారు. సెక్షన్ 103 కింద కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications