మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ఎన్నిక‌లు : బంధువులందరూ బరిలోనే.. గెలిచేదేవరు..

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో శాస‌న‌స‌భల ఎన్నికల పోరు ర‌స‌వత్త‌రంగా మారింది. ఆ రాష్ట్రంలో అధికార పార్టీ, ప్ర‌తిప‌క్ష పార్టీలు నువ్వానేనా అంటూ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇక్క‌డ క‌మ‌లం పార్టీ అధికారంలో ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఎలాగైనా త‌న సీటును ఖారురు చేసుకోవాల‌ని వ్యూహాలు ర‌చిస్తోంది. ప్ర‌తిప‌క్ష పార్టీ మాత్రం ఈసారి ఎలాగైనా ప‌గ్గాలు ద‌క్కించుకోవాల‌ని త‌న సాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తోంది. అయితే, ఈ రాష్ట్రంలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం కుటుంబాల మ‌ధ్య ఎన్నిక‌ల సంగ్రామం మొద‌లుకానుంది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని హోషంగ‌బాద్ నియోజ‌క‌వ‌ర్గంలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఎన్నిక‌ల పోరులో నిల‌వ‌గా, మ‌రోప‌క్క డియోత‌లాబ్ నియోజ‌క‌వ‌ర్గంలో మామా అల్లుల్లు ఎన్నిక‌ల స‌మరానికి సిద్ధ‌మ‌వుతున్నారు. సాగ‌ర్‌నియోజ‌క‌వ‌ర్గంలో బావ‌మ‌ర‌ద‌ళ్లు త‌ల‌ప‌డ‌గా, డ‌బ్రా నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్ద‌రి ద‌గ్గ‌రి బంధువులు మ‌ధ్య పోటీ జ‌ర‌గ‌నుంది.

MP assembly election 2023: All Relatives of Same family contest in polls,interesting

ప్ర‌త్య‌ర్థులుగా అన్న‌ద‌మ్ములు...
హోషంగ‌బాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నో ద‌శాబ్దాల నుంచే బిజెపి అధికారంలో ఉంది. ఈ సారి ఎన్నిక‌ల్లో ఇక్క‌డ అన్న‌ద‌మ్ముల మ‌ధ్య పోరు కొన‌సాగనుంది. గిరిజాశంక‌ర్ శ‌ర్మ‌, సీతాశ‌ర‌ణ్ శ‌ర్మ అన్న‌ద‌మ్ములు. వీరిద్ద‌రూ బిజెపి కాంగ్రెస్ త‌ర‌పును ప్ర‌త్య‌ర్థులుగా నిల‌బ‌డ‌నున్నారు. గిరిజాశంక‌ర్‌కు 73ఏళ్లు. ఈయ‌న 2003,2008 ఎన్నిక‌ల్లో బిజెపి త‌ర‌పున పోటీచేసి రెండు సార్లు విజ‌యం సాధించారు. ఆయ‌న త‌మ్ముడు సీతాశ‌ర‌ణ్‌కు 69యేళ్లు. ఆయ‌న కూడా ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి బిజెపి త‌ర‌పున ఐదుసార్లు పోటీచేసి విజ‌య‌ఢంకా మోగించారు. సీతాశ‌ర‌ణ్ శ‌ర్మ 1990,1993, 1998, 2013, 2018 ఎన్నిక‌ల్లో విజ‌య ప‌త‌కాలు ఎగుర‌వేశారు. అయితే 2018 ఎన్నిక‌ల నుంచి అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఎన్నిక‌ల వైరం మొద‌లైంది. 2018 ఎన్నిక‌ల్లో తొలుత గిరిజాశంక‌ర్‌ను తమ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన బిజెపి త‌ర్వాత సీతాశ‌ర‌ణ్‌కు సీటు కేటాయించింది. గిరిజాశంక‌ర్ 2023 సెప్టెంబ‌ర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఈసారి ఎన్నిక‌ల‌కు హోషంగ‌బాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీతాశ‌ర‌ణ్ బిజెపి త‌ర‌పున పోటీచేయ‌గా, అత‌ని సోదరుడు గిరిజాశంక‌ర్‌కు కాంగ్రెస్ సీటు కేటాయించింది.

డియోత‌లాబ్ నియోజ‌క‌వ‌ర్గంలో మామా అల్లుళ్ల పోరు...
ఇక‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని డియోత‌లాబ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మామా అల్లుళ్లు పోటీకి సై అంటున్నారు. బిజెపి త‌ర‌పును గిరీశ్ గౌత‌మ్ పోటీచేయ‌గా, కాంగ్రెస్ త‌ర‌పున ప‌ద్మేష్ గౌత‌మ్ పోటీకి దిగ‌నున్నారు. గిరిష్ గౌత‌మ్‌కు 70యేళ్లు. ఈయ‌న నాలుగుసార్లు డియోత‌లాబ్ నుంచి పోటీచేసి విజ‌యం సాధించారు. గిరిష్ గౌత‌మ్ మొద‌ట్లో సిపిఐ నుంచి పోటీచేశారు. ఆత‌ర్వాత బిజెపిలో చేరారు. ప‌ద్మేష్ గౌత‌మ్, గిరిష్ గౌత‌మ్‌కు స్వ‌యాన మేన‌ల్లుడు. ప‌ద్మేష్ తొమ్మిదేళ్ల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఇప్పుడూ వీరిద్ద‌రూ ప్ర‌త్య‌ర్థులుగా బ‌రిలోకి దిగ‌నున్నారు. ఇలా పోటీచేయ‌డం వెనుక కుటుంబ క‌ల‌హాలే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం...
సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో బావ‌మ‌ర‌ద‌ళ్లు ప్ర‌త్య‌ర్థులుగా బ‌రిలోకి దిగ‌నున్నారు. కాంగ్రెస్ త‌ర‌పున నిధి జైన్‌ పోటీచేయ‌గా, బిజెపి త‌ర‌పున శైలేంద్ర జైన్ పోటీచేయ‌నున్నారు. శైలేంద్ర జైన్ సోద‌రుడి భార్యే నిధి జైన్‌. శైలేంద్ర జైన్ ఇక్క‌డి నుంచి మూడుసార్లు పోటీ చేసి విజ‌యం సాధించారు. ఈ బంధువుల బ‌రిలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ఎంతో ఉత్కంఠంగా మార‌నున్నాయి. అయితే, ఈ కుటుంబాల బ‌రిలో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+