Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ మహిళా ఎంపీ చీరతోనే స్టైలిష్ గా ఫుట్‌బాల్ ఆడేశారు... నెట్టింట జనాలు ఫిదా అయ్యారు!!

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా ఆమె రాజకీయాల్లో ఎప్పుడూ ప్రధాన ఆకర్షణగానే ఉంటారు. తాజాగా పశ్చిమ బెంగాల్ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆమె యువతలో క్రీడా స్ఫూర్తి నింపారు. ఖేలా హోబే దివస్ సందర్భంగా ఫుట్ బాల్ ఆడారు. తనలో ఉన్న ఫుట్ బాల్ స్కిల్స్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బయటపెట్టారు. ప్రస్తుతం ఆమె ఫుట్ బాల్ ఆడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూస్తున్న వారు ఫిదా అయ్యారు. ఆమె స్టైల్ కు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు.

చీర కట్టుకుని ఫుట్ బాల్ ఆడిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా

చీర కట్టుకుని ఫుట్ బాల్ ఆడిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా

చీర కట్టుకొని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యురాలు మహువా మొయిత్రా ఫుట్ బాల్ ఆడిన స్టైల్ అక్కడి వారు అందరినీ ఆకట్టుకుంది. ఒకచేత్తో చీర కట్టుకొని కాలితో ఫుట్ బాల్ తంతున్న ఫోటోలను తృణమూల్ ఎంపీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మహువా మొయిత్రా చీర కట్టుకొని, కాళ్లకు స్నీకర్స్ వేసుకొని కళ్లకు సన్గ్లాసెస్ పెట్టుకొని ఒక చేతితో చీర పట్టుకుని కాలితో, ఫుట్ బాల్ ఆడడం యువతలో హుషారు నింపింది.

ఖేలా హోబే దివస్ ... మహువా మొయిత్రా ఫుట్ ఆడిన ఫోటోలు వైరల్

తృణమూల్ కాంగ్రెస్ ఆగస్టు 16వ తేదీన 'ఖేలా హోబే దివస్'ను పాటిస్తామని ప్రకటించింది. క్రీడలను ప్రోత్సహించడానికి పార్టీ నాయకులు పశ్చిమ బెంగాల్ అంతటా ఫుట్‌బాల్ మ్యాచ్‌లను నిర్వహించారు. ఇందులో భాగంగా తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ఓ ఈవెంట్‌లో ఫుట్‌బాల్ ఆడుతున్న ఫోటోలను షేర్ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని యువత ఎక్కువగా క్రీడల్లో పాల్గొనాలని ఆమె పేర్కొన్నారు. అప్పుడే శారీరక, మానసిక ఆరోగ్యం ధృడంగా ఉంటుందని చెప్పారు.

 ఖేలా హోబే .. టీఎంసీ ఎన్నికల ప్రచారాస్త్రం .. నేటికీ ఈ నినాదంతోనే టీఎంసీ

ఖేలా హోబే .. టీఎంసీ ఎన్నికల ప్రచారాస్త్రం .. నేటికీ ఈ నినాదంతోనే టీఎంసీ


ఇక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. పశ్చిమబెంగాల్లో ఖేలా హోబ్' (ఆట కొనసాగుతోంది) అనేది గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రధానంగా సాగించిన ఎన్నికల ప్రచార అస్త్రం. బీజేపీతో ధీటుగా పోరాటం చేసి, కేంద్రంలోని బిజెపిని ధిక్కరించి ఆ పార్టీ బిజెపిని ఓడించి వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చింది. ఇక అప్పటి టీఎంసీ నినాదం ఖేలా హోబే ఇంకా కొనసాగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+