ఎంపీ తలకు తుపాకీ పెట్టిన కానిస్టేబుల్: సమాధానం తెలిస్తే షాకే
చింద్వారా: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ఎంపీ కమల్‌నాథ్ తలకు తుపాకీ గురిపెట్టాడు. ఢిల్లీ విమానం ఎక్కేందుకు చింద్వారా విమానాశ్రయానికి శుక్రవారం సాయంత్రం కమల్‌నాథ్ వచ్చారు.
అయితే, విమానాశ్రయంలో ఎంపీ భద్రత కోసం వచ్చిన పోలీసుల్లో ఒక కానిస్టేబుల్ అకస్మాత్తుగా ఆయన తలకి లోడ్ చేసి ఉన్న గన్ గురి పెట్టారు. వెంటనే గమనించిన పోలీసులు కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. సదరు కానిస్టేబుల్‌ను రత్నేష్ పవార్‌గా అధికారులు గుర్తించారు. పవార్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

అయితే, తాను అలా ఎందుకు చేశానో తెలియడం లేదని పవార్ చెప్పుకొస్తున్నాడు. అసలు ఆ క్షణంలో ఏం జరిగిందో తనకు ఏమీ గుర్తులేదని అంటుండటం గమనార్హం. ప్రస్తుతం అతడిని విధుల నుంచి తప్పించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్లు అడిషనల్ ఎస్పీ నీరజ్ సోని తెలిపారు.












Click it and Unblock the Notifications