ఎన్నికల వేళ పార్లమెంటా ? బడ్జెట్ భేటీ త్వరగా ముగించరూ- ఆ ఐదు రాష్ట్రాల ఎంపీల మొర
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగిన వేళ రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం పలువురు ఎంపీలను ఇబ్బందులకు గురి చేస్తోంది. అసలే ఎన్నికల వేళ సొంత రాష్ట్రాల్లో ప్రచారం చేసుకునేందుకు అవకాశం లేకుండా బడ్జెట్ సమావేశాల నిర్వహణ ఏంటని పలువురు ఎంపీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని లోక్‌సభ స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు.
ఎన్నికలు జరుగుతున్న పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడుకు చెందిన ఎంపీలు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను త్వరగా ముగించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఇవాళ పార్లమెంటు సమావేశాల రెండో విడత ప్రారంభమైన నేపథ్యంలో వారు లోక్‌సభ స్పీకర్‌ను కలిసి తమ విజ్ఞప్తిని తెలిపారు. దీంతో కేంద్రం కూడా ఆలోచనలో పడింది. ఎన్నికల వేళ ఎంపీలను పార్లమెంటుకు రప్పించడం కష్టం, అలాగని అర్ధాంతరంగా సమావేశాలు వాయిదా వేస్తే విమర్శలు తప్పవు. దీంతో కేంద్రం కూడా దీనిపై ఏం చేయాలన్న దానిపై సంప్రదింపులు జరుపుతోంది.

ఐదు రాష్ట్రాల ఎంపీల అభ్యర్ధన నేపథ్యంలో పార్లమెంటు మూడ్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటామని లోక్‌సభ స్పీకర్ వారికి చెప్పినట్లు తెలుస్తోంది. అంటే మెజారిటీ ఎంపీలు లేదా పార్టీలు ఈ వాదనకు మద్దతు పలికితే పార్లమెంటు సమావేశాలు త్వరగా ముగించేందుకు చర్యలు తీసుకుంటామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు చెప్పారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఆయా రాష్ట్రాల ఎంపీలు కూడా కేంద్రాన్ని చమురు ధరలపై ఇరుకునపెడుతున్న నేపథ్యంలో ద్రవ్యబిల్లుకు ఆమోదం తెలిపి పార్లమెంటును విరవధికంగా వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ












Click it and Unblock the Notifications