జయలలితంటే వారికి పిచ్చి ప్రేమ, అందుకే ఇలా చేశారు
జయలలితకు తమిళనాడులో వీరాభిమానులు ఉన్నారు. ఆమె అంటే ప్రాణం ఇచ్చేంత అభిమానం ఉంది. ఒకరు నాలుక కోసుకొంటే, మరోకరు శిలువ వేసుకొన్నారు . ఈ రకంగా అభిమానంతో ఆమె కోసం అనేకమంది పలు రకాల ఘటనలకు పాల్పడ్డారు.
చెన్నై : జయలలితకు వీరాభిమానులున్నారు. పార్టీలో ఆమెంటే ప్రాణం ఇచ్చే కార్యకర్తలున్నారు. పేదల ప్రజల సంక్షేమం కోసం ఆమె చేపట్టిన సంక్షేమపథకాలు ఆమె ప్రతిష్టను మరింత ఇనుమడింపజేశాయి.జయలలిత నేతృత్వంలో పార్టీ విజయం సాధించాలని పలువురు కార్యకర్తలు పలు ఘటనలకు పాల్పడ్డారు.
2004 లోక్ సభ ఎన్నికల్లో ఎఐఎడిఎంకె తమిళనాడు రాష్ట్రంలో 40 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవాలని జయ వీరాభిమాని కోరుకొన్నాడు. ఆయన పోలీసు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తాడు. సేలం జిల్లా ఆయన స్వంత ఊరు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడిఎంకె 40 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలని కోరుకొంటూ రతినామ్ అనే కానిస్టేబుల్ తన ఎడమ చేతి మూడు వేళ్ళను నరికివేసుకొన్నాడు.

అయితే ఈ విషయం తెలుసుకొన్న జయలలిత రతినామ్ కు ఆసుపత్రిలో చికిత్స చేయించింది. భవష్యత్తులో ఇలా చేయకూడదని ఆమె ఆయనను హెచ్చరించింది. 2004 లో జయలలిత జైలుకెళ్ళింది. ఆమె త్వరగా విడుదల కావాలని శిలువ వేసుకొన్నాడు హుస్సేనీ అనే వ్యక్తి. ఈయనే తన రక్తంతో జయ చిత్రం గీసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు.
జయకు మద్దతుగా ఇలాంటి ఘటనలు అనేకం తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొన్నాయి. అయితే ఈ తరహా ఘటనలను ఆమె ప్రోత్సహించలేదు. జయ దృష్టిలో పడేందుకు చాలమంది ప్రయత్నించేవారు. అయితే ఆమె మాత్రం ఈ తరహా ఘటనలకు పాల్పడి తన దృష్టిలో పడేందుకు ప్రయత్నించడాన్ని ఆమె సమర్థించేవారు కాదు.












Click it and Unblock the Notifications