Muhurat Trading అంటే ఏంటి: ఆ గంటలో కొనాల్సిన బెస్ట్ స్టాక్స్ ఇవే..!!

దీపావళి అంటే వెలుగుల పండగ. జీవితాల్లో వెలుగులు కాంతులు నింపే పండగ. అది ఏ రూపంలోనైనా కావొచ్చు. ఇక దీపావళి సమయంలో ఎంతో కొంత బంగారం కొంటే మేలు జరుగుతుందని కొందరు చెబుతుంటారు. దీంతో ఈ సమయంలో అన్ని బంగారం దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ఇక స్టాక్‌మార్కెట్‌లలో ఇన్వెస్ట్ చేసేవారికోసం దీపావళి రోజున సెలవు దినం అయినప్పటికీ ముహూరత్ ట్రేడింగ్ పేరుతో ఒక గంట మాత్రమే స్టాక్ మార్కెట్స్ తెరిచి ఉంటాయి. ఆ ముహూరత్ సమయంలో ట్రేడింగ్ చేస్తే ఐశ్వర్యం తమ వెంట ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. మరి ముహూరత్ ట్రేడింగ్ అంటే ఏంటి.. దీపావళి రోజున ఏ సమయంలో ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు అనేది ఇక్కడ తెలుసుకుందాం.

గంట మాత్రమే ట్రేడింగ్

గంట మాత్రమే ట్రేడింగ్


దీపావళి 2021లో నవంబర్ 4వ తేదీన వచ్చింది. ఇక దీపావళి రోజును ఇన్వెస్టర్లు మంచి రోజుగా భావిస్తారు. ముహూరత్ ట్రేడింగ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ సారి కూడా స్టాక్ మార్కెట్ ముహూరత్ ట్రేడింగ్ సమయాలను ప్రకటించింది. కేవలం గంట సమయం మాత్రమే మార్కెట్లు ట్రేడింగ్‌కు తెరిచి ఉంటాయి. గత 50 ఏళ్లుగా ఈ మూహూరత్ ట్రేడింగ్ సంస్కృతి కొనసాగుతోంది. 2021 దీపావళి రోజున స్టాక్ మార్కెట్లు సాయంత్రం 6గంటల 15 నిమిషాలకు ప్రారంభమై 7 గంటల 15 నిమిషాల వరకు ఉంటాయి. ఈ ఒక్క గంట సమయం ఎంతో మంచి సమయం అని చాలామంది విశ్వసిస్తారు. అంతేకాదు హిందూ మత విశ్వాసం ప్రకారం అకౌంటింగ్‌కు తొలిమూహుర్తంగా భావించడమే కాకుండా... అకౌంటింగ్ సంవత్సరం ప్రారంభంకు ఈ ముహూర్తం మంచిదని భావిస్తారు.

ముహూరత్ ట్రేడింగ్ అంటే ఏంటి..?

ముహూరత్ ట్రేడింగ్ అంటే ఏంటి..?

దీపావళి రోజున ఒక గంట సమయం పాటు మాత్రమే శుభప్రదంగా భావించి ట్రేడింగ్ చేయడాన్ని ముహూరత్ ట్రేడింగ్ అంటారు. ఆ సమయంలో కొనుగోలు చేసిన స్టాక్స్ మంచి లాభాలు తెచ్చిపెడతాయని విశ్వసిస్తారు. అయితే కాలక్రమంలో ముహూరత్ ట్రేడింగ్ అనేది ఒక సంస్కృతిగా మారిపోయింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి నాంది దీపావళి పండగ. ఈ రోజున ట్రేడర్లు ప్రత్యేకంగా ఒక గంట సమయం మాత్రమే ట్రేడింగ్ చేస్తారు. అందుకే దీన్ని ముహూరత్ ట్రేడింగ్ అని అంటారు. ఇక ముహూరత్ ట్రేడింగ్ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ప్రారంభమై 7 గంటల 15 నిమిషాలకు ముగుస్తుంది

ముహూరత్ ట్రేడింగ్ ప్రాముఖ్యత

ముహూరత్ ట్రేడింగ్ ప్రాముఖ్యత

ముహూరత్ ట్రేడింగ్ తొలిసారిగా బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ప్రవేశపెట్టింది. 1957లో ఒక గంట సమయం మాత్రమే ట్రేడింగ్‌కు కేటాయించింది. ఇక 1992లో నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ కూడా ఈ పద్ధతిని పాటించడం ప్రారంభించింది. ఇక అప్పటి నుంచి దీపావళి రోజున జరిగే గంటపాటు ట్రేడింగ్‌లో అంతా మంచే జరిగి ఐశ్వర్యం వెంట వస్తుందనే విశ్వాసం మదుపర్లలో బలంగా ఉంది. ఈ సమయంలో ఐశ్వర్యం, సంపదకు మూలంగా భావించే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ముహూరత్ ట్రేడింగ్‌లో స్టాక్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది.?

ముహూరత్ ట్రేడింగ్‌లో స్టాక్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది.?

గతేడాది నవంబర్ 14వ తేదీన ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ జరిగింది. ఆ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 195 పాయింట్ల మేరా లాభపడి 43,638 వద్ద ముగిసింది.మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌ 51 పాయింట్ల మేరా లాభపడి 12771 వద్ద ముగిసింది. ప్రతి ఏటా ముహూరత్ ట్రేడింగ్ సమయంలో ఈక్విటీ సూచీల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఈ ఏడాది కూడా ముహూరత్ ట్రేడింగ్ సమయంలో మంచి లాభాలు వస్తాయని భావిస్తున్నారు. మార్కెట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

నిపుణులు ఏం చెబుతున్నారు..?

నిపుణులు ఏం చెబుతున్నారు..?

ముహూరత్ ట్రేడింగ్ సమయంలో లేదా సాధారణ రోజుల్లో అయినా సరే ఒక వ్యక్తి ఒక స్టాక్ పై ఇన్వెస్ట్ చేసేముందు దాని పనితీరును కచ్చితంగా పరిశీలించాలి. కంపెనీ లాభ నష్టాలపై ఒక అవగాహన కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.కంపెనీని లాభాల్లోకి నడిపించే అంశాలను తెలుసుకోవాలి. ఎంత లాభం వస్తుందో విశ్లేషించగలగాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ముహూరత్ ట్రేడింగ్‌లో నాలుగు బెస్ట్ స్టాక్స్‌ను నిపుణులు సూచిస్తున్నారు.

* రేమండ్‌ను కొనుగోలు చేయొచ్చు.
Stop Loss- 480
Target 520-530

* ఇండియా సిమెంట్: 210 రూపాయల వద్ద కొనుగోలు చేయండి
Stop Loss- 207
Target 218

* కొటాక్ మహేంద్ర బ్యాంక్ - 2045 వద్ద అమ్మండి
Stop Loss- 2070
Target 1990

గ్రాసిమ్: 1780 వద్ద గ్రాసిమ్ స్టాక్స్‌ను కొనుగోలు చేయండి
Stop Loss- 1766
Target 1824,1866

ఇంకెందుకు ఆలస్యం వెంటనే ముహూరత్ ట్రేడింగ్ చేయండి... ఆ పై లాభాలను పొందండి. అయితే రిస్క్ మాత్రం పూర్తిగా ఇన్వెస్టర్‌దే అయి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+