ముకేశ్ అంబానీ కూతురికి అతను ప్రపోజ్ చేశాడు: త్వరలోనే పెళ్లి!..
Recommended Video

ముంబై: దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ గారాల పట్టి ఈశా వివాహం నిశ్చయమైంది. ప్రముఖ వ్యాపారవేత్త, పిరమాల్ సంస్థల వారసుడు ఆనంద్ పిరమాల్‌తో త్వరలోనే ఆమె వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో కాబోయే వధూవరులు తమ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం రాత్రి ముంబైలోని ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించడం విశేషం.
ఆనంద్ పిరమాల్ యువ వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పిరమాల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. ఆయన తండ్రి అజయ్ ఈ సంస్థకు ఛైర్మన్. కాగా, అంబానీ, పిరమల్ కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలుగా మంచి స్నేహం ఉంది.

ఇటీవల మహాబలేశ్వర్‌లోని ఓ ఆలయంలో ఆనంద్ ఈశాకు ప్రపోజ్ చేశారు. విషయం ఇంట్లోవాళ్లకు చెప్పడంతో.. ఇరు కుటుంబాల పెద్దలు అందుకు ఒప్పుకున్నారు. ఆ వెంటనే ఇరు కుటుంబాలు కలిసి విందు కూడా చేసుకున్నాయి. డిసెంబర్ లో వీరి వివాహం జరిగే అవకాశం ఉందంటున్నారు.
ఇక ఈశా సోదరుడు ఆకాశ్ అంబానీ వివాహం కూడా డిసెంబర్ నెలలోనే జరగనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకతో ఆకాశ్ నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది.












Click it and Unblock the Notifications