Jio: అంబానీకి భారీ షాక్- జియో రేట్ల దెబ్బకు ఎంతమంది ఎగిరిపోయారో తెలుసా ?
దేశంలో మొబైల్ ఆపరేటింగ్ వ్యవస్ధను తమ గుప్పిట్లో పెట్టుకున్న రెండు, మూడు సంస్ధలు ఎప్పటికప్పుడు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకుంటూ పోతున్నాయి. ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ తో సంబంధం లేకుండా అన్ని ప్లాన్ల రేట్లను యూజర్లు కళ్లు మూసి తెరిసే లోగా పెంచేస్తున్నాయి. దీనికి ఎన్నో సాకులు కూడా చెప్తున్నాయి. అయితే వీరి గుత్తాధిపత్యానికి చెక్ పడే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నట్లు తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
దేశంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో తాజాగా అన్ని ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ప్లాన్ల రేట్లను పెంచేసింది. ఆరంభంలో కాల్స్, డేటా అన్నీ ఉచితం అంటూ ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన జియో ఎప్పటికప్పుడు ఇలా రేట్లను పెంచుకుంటూ పోతోంది. అయితే గతంలో పెంచిన రేట్లన్నీ ఓ ఎత్తు. ఈసారి పెంచిన రేట్లు మరో ఎత్తుగా పరిస్దితి మారిపోయింది. దీంతో యూజర్లు కూడా అంతే ఘాటుగా జియోకు షాకులు ఇచ్చేస్తున్నారు.

జియో తాజాగా రేట్లు పెంచిన తర్వాత కస్టమర్లు ఒక్కొక్కరిగా ఈ నెట్ వర్క్ ను వీడటం మొదలుపెట్టేశారు. ఇదే క్రమంలో జియో ఏకంగా కోటీ 9 లక్షల యూజర్లను కోల్పోయింది. ఈ ఆర్దిక సంవత్సరం రెండో క్వార్టర్ లోనే ఈ కోటీ 9 లక్షల మంది జియోను వీడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తద్వారా ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు. వీరిలో చాలా మంది ప్రభుత్వ రంగ సంస్ధ బీఎస్ఎన్ఎల్ కు మారిపోతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు జియో తమ 5జీ సబ్‌స్క్రైబర్ బేస్ ను 17 మిలియన్లు పెంచుకున్నట్లు ఓవరాల్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంలో జియో 5జీ యూజర్ బేస్ 130 మిలియన్లుగా ఉండగా ఇప్పుడు అది కాస్తా 147 మిలియన్లకు చేరుకుంది. అలాగే ఏఆర్పీయూ కూడా 181.7 నుండి 195.1కి పెరిగింది. కానీ జియో ఓవరాల్ యూజర్ల సంఖ్య మాత్రం క్షీణిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే రిలయన్స్ కు మరిన్ని షాకులు తప్పేలా లేవు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications