వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ములాయంను పీఎం చేయాలి, రాహుల్‌ను..: అఖిలేష్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తుపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అఖిలేశ్‌ను మీడియా ప్రతినిధులు కాంగ్రెస్‌తో పొత్తుపై ప్రశ్నించారు.

దీనికి ఆయన స్పందిస్తూ.. విచిత్రకరమైన షరతులు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుకు సమాజ్‌వాదీ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అయితే తాను పెట్టిన రెండు షరతులు నెరవేర్చాలని తేల్చి చెప్పారు.

తన తండ్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత అయిన ములాయంసింగ్‌ యాదవ్‌ను ప్రధానిని, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఉపప్రధానిగా చేస్తానంటేనే కాంగ్రెస్‌తో పొత్తుకు తాము ముందుకొస్తామని స్పష్టం చేశారు. తన తండ్రి ప్రధాని కావాలనే కల నెరవేరాలని అన్నారు.

Mulayam Singh as PM, Rahul Gandhi as Deputy PM: Akhilesh Yadav's Formula

బిజెపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని అఖిలేష్ తేల్చి చెప్పారు. అంతేగాక, రాహుల్ గాంధీ తనకు పాత మిత్రుడేనని చెప్పారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా హాజరవడం గమనార్హం.

రాహుల్‌ గాంధీ సమక్షంలోనే అఖిలేశ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, అఖిలేష్ వ్యాఖ్యలపై స్పందించాలని రాహుల్ గాంధీని కోరగా.. ఆయన విముఖత వ్యక్తం చేశారు.

English summary
Mulayam Singh Yadav as Prime Minister, Rahul Gandhi as his deputy - the formula was born today as Uttar Pradesh Chief Minister Akhilesh Yadav tackled questions at the HT Leadership Summit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X