రెండు నెలల్లో కొత్త పార్టీ పెట్టనున్న ములాయంసింగ్?అఖిలేష్ సవాల్
సమాజ్ వాదీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఈ ఏడాది మార్చి తర్వాత కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారని ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ ప్రకటించారు.
లక్నో:సమాజ్ వాదీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఈ ఏడాది మార్చి తర్వాత కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారని ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ ప్రకటించారు.
సమాజ్ వాదీపార్టీని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన చేతుల్లోకి తీసుకొన్నారు. దీంతో ములాయం వర్గానికి తీవ్ర నిరాశే ఎదురైంది.
ములాయం సూచించిన అభ్యర్థులకు కూడ అఖిలేష్ సమాజ్ వాదీ పార్టీ టిక్కెట్లను కేటాయించాడు. బాబాయ్ శివపాల్ యాదవ్ కు కూడ జస్వంత్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు అఖిలేష్.
అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల పొత్తు కుదుర్చుకొంది. ఈ పొత్తులో భాగంగా 298 స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ,105స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీచేస్తోంది.

మార్చిలో ములాయం సింగ్ కొత్త పార్టీ
ఉత్తర్ ప్రదేశ్ లో మార్చి 11వ,తేదితో ఎన్నికలు పూర్తవుతాయి. ఈ ఎన్నికల తర్వాత సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ తో కలిసి కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారని శివపాల్ యాదవ్ ప్రకటించారు.అఖిలేష్ యాదవ్ పై శివపాల్ యాదవ్ తన అక్కసును వెళ్లగక్కారు.ఎన్నికల తర్వాత అఖిలేష్ యాదవ్ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో చూస్తాను అంటూ సవాల్ విసిరారు.

నామినేషన్ దాఖలు చేసి అఖిలేష్ పై విమర్శలు
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జశ్వంత్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా శివపాల్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన అఖిలేష్ పై నిప్పులు చెరిగారు. అఖిలేష్ ఇచ్చిన భిఫారంతోనే ఆయన నామినేషన్ దాఖలు చేశారు.మరో వైపు ఆయనపైనే నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆయన అఖిలేష్ కు సవాల్ విసరడం గమనార్హం.

ములాయం దారిలోనే శివపాల్
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ తప్పుబట్టారు. ఈ కారణాన్ని చూపుతూ ఎన్నికల ప్రచారానికి తాను దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు.శివపాల్ యాదవ్ కూడ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీకి ఉత్తర్ ప్రదేశ్ లో కనీసం నాలుగు సీట్లలో కూడ గెలవలేదు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడమేమిటని ఆయన ప్రశ్నించారు.

పార్టీలో నా మద్దతుదారులే ఎక్కువ
సమాజ్ వాదీ పార్టీలో తన మద్దతుదారులే ఎక్కువ ఉన్నారని శివపాల్ యాదవ్ చెప్పారు. పార్టీలో మెజార్టీ తనతోనే ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.అయితే పార్టీ పగ్గాలన్నీ అఖిలేష్ యాదవ్ కు దక్కాయి.అఖిలేష్ యాదవ్ చేతికి పార్టీ పగ్గాలు రాకముందే మెజార్టీ నాయకులు అఖిలేష్ యాదవ్ వైపే ఉన్నారు. ములాయంసింగ్ వర్గానికి అనుకూలంగా నిలిచినవారికి కూడ అఖిలేష్ టిక్కెట్టు కేటాయించారు.

అఖిలేష్ కు శివపాల్ సవాల్
కాంగ్రెస్ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల పొత్తును కుదుర్చుకొంది.అయితే ఈ పొత్తుతో మరోసారి అధికారంలోకి రావచ్చని సమాజ్ వాదీ పార్టీ భావిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీతో పోత్తు వల్ల సమాజ్ వాదీకి ప్రయోజనం లేదని ములాయం సింగ్ అభిప్రాయపడుతున్నారు.అయితే పార్టీలో శివపాల్, అమర్ సింగ్, ములాయం సింగ్ ఆదిపత్యం లేకుండా చేశారు అఖిలేష్.అయితే ఎన్నికలు పూర్తైన తర్వాత అఖిలేష్ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తావంటూ శివపాల్ యాదవ్ చేసిన సవాల్ సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం ఇంకా సమసిపోలేదనే సంకేతాలను ఇస్తోంది. ఎన్నికల తర్వాత విజయం సాధించిన అభ్యర్థులతో శివపాల్ చక్రం తిప్పుతారా అనే చర్చకూడ లేకపోలేదు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications