శివపాల్, అపర్ణ రూపంలో త్రెట్: అఖిలేశ్ తిరుగుబాటు, తమ్ముడివైపు నిలిచిన ములాయం

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌‌తో ఐదారేళ్ల క్రితం మొదటి భార్య కుమారుడు అఖిలేశ్ యాదవ్ మధ్య కోల్డ్ వార్ జరిగింది. అందుకు ములాయం రెండో భార్య సంతానం కారణం. వారు ఎక్కడ పార్టీని హస్తగతం చేసుకుంటారోనని అఖిలేశ్ భయపడి.. పార్టీని తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. ఆయన వెంట క్యాడర్, నేతలు నిలువడంతో.. ఈసీ వద్దకు వెళ్లినా అఖిలేషే నెగ్గాడు. ఆ తర్వాత ములాయం ప్రభ తగ్గుతూ వచ్చింది. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

 జోక్యం, శివపాల్ సింగ్ అజమాయిషీ

జోక్యం, శివపాల్ సింగ్ అజమాయిషీ

పార్టీ వ్యవహారాల్లో తన తండ్రి జోక్యం, బాబాయ్ శివపాల్ సింగ్ అజమాయిషీని అఖిలేశ్ సహించలేకపోయారు. ఇలానే ఉంటే తన పరిస్థితి ఏంటీ అని ఆలోచించారు. తన వర్గాన్ని తయారు చేసి మరీ తిరుగుబాటు వేశారు. ఆ సమయంలో ములాయం సింగ్.. తన సోదరుడు శివపాల్ యాదవ్ వైపు నిలిచారు. శివపాల్.. అతని వర్గాన్ని మంత్రివర్గాన్ని నుంచి తొలగించడాన్ని తప్పుపట్టారు. వారు పార్టీ కోసం చాలా చేశారని బహిరంగంగానే ప్రకటించారు. అయినప్పటికీ నో యూజ్.. అఖిలేశ్ వినలేదు.

అఖిలేశ్ టీమ్

అఖిలేశ్ టీమ్


ఆ సమయంలో అఖిలేష్ కోర్ టీమ్‌లో ఉదయవీర్ సింగ్, రాజేంద్ర చౌధరి, అభిషేక్ మిశ్రా, నరేష్ ఉత్తమ్ పటేల్ ఉన్నారు. వారు చెప్పడంతో పార్టీ టికెట్స్ అందజేశారు. కొన్ని స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దించింది. ఆ టికెట్ ఆశించిన వారు పార్టీ అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారట. లేదంటే మరో పార్టీలో చేరారట. దీంతో పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. చివరికీ బీజేపీ నుంచి వచ్చిన కొందరు మంత్రులను పార్టీలో చేర్చుకోవడం.. టికెట్ ఇవ్వడం ప్రజలకు మింగుడుపడలేదు. స్వామీ ప్రసాద్ మౌర్య ఫాజీల్‌నగర్ నుంచి ఓడిపోయారు. అఖిలేశ్ వదిన అపర్ణా యాదవ్ ఎస్పీ వదిలి బీజేపీలో చేరిన సమయంలో కూడా ఆమెను అడ్డుకోడానికి అఖిలేశ్ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దీంతో ములాయం ఆగ్రహానికి కారణమైంది.

 ప్రచారానికి రానీ ములాయం

ప్రచారానికి రానీ ములాయం


శివపాల్ సింగ్ నియోజకవర్గంతోపాటూ ఒకటి రెండు సభల్లో అఖిలేశ్ పాల్గొన్నారు. ములాయం సింగ్‌ను ప్రచారం కోసం ఒప్పించలేకపోయారు. కుటుంబ సభ్యులను అఖిలేశ్ యాదవ్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచారు. అయినప్పటికీ ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. పార్టీని మాత్రం అఖిలేశ్ హస్తగతం చేసుకున్నారు. ములాయం రెండో భార్య వారసులకు పట్టం కడతారనే ఊహాగానాల నేపథ్యంలో అలర్ట్ అయ్యారు. పార్టీని తన గుప్పిట్లోకి తీసుకున్నారు. శివపాల్ సింగ్, అండ్ కోటరిపై వేటు వేశారు. పార్టీలో ఇంత జరుగుతున్న ములాయం సింగ్ యాదవ్ చూస్తూ ఉరుకునే పరిస్థితి.

 వైరం ఇలా..

వైరం ఇలా..


అఖిలేష్ యాదవ్ 2012లో ఉత్తరప్రదేశ్ సీఎం పదవీ చేపట్టారు. అప్పటినుంచి కుటుంబంలో వైరం నెలకొంది. కుటుంబం రెండు వర్గాలుగా విడిపోయింది. అఖిలేష్ నేతృత్వంలో ఒక వర్గం, శివపాల్ ఒక వర్గంగా నిలిచింది. ప్రత్యర్థి వర్గానికి ములాయం సింగ్ నాయకత్వం వహించాడు. 2016 డిసెంబరు 30న, ములాయం యాదవ్ తన కుమారుడు అఖిలేష్, అతని బంధువు రామ్ గోపాల్‌ను క్రమశిక్షణా రాహిత్యానికి సంబంధించి ఆరేళ్ల పాటు పార్టీ నుండి బహిష్కరించారు. 24 గంటల తర్వాత ఆ నిర్ణయాన్ వెనక్కి తీసుకున్నారు. తండ్రిని పార్టీ అధ్యక్ష పదవీ నుండి తొలగించి, 2017 జనవరి 1వ తేదీన పార్టీ జాతీయ సమావేశం నిర్వహించి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవీ చేపట్టారు. జాతీయ సమావేశం చట్టవిరుద్ధమని ములాయం పేర్కొన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తన బంధువు రాం గోపాల్ యాదవ్‌ను బహిష్కరించాడు. ఆ కార్యనిర్వాహక సమావేశాన్ని సమావేశపరిచే హక్కు రామ్ గోపాల్ యాదవ్‌కు ఉందని భారత ఎన్నికల సంఘం తీర్పునిచ్చింది. ములాయం సింగ్ ఆదేశాలను తిప్పికొట్టింది. దీంతో అఖిలేష్ యాదవ్ అధికారికంగా పార్టీ జాతీయ నాయకుడు అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+