బెంగళూరులో కుప్పకూలిన భవనం, స్కూటర్ లో వెలుతుంటే, అత్యాశతో, ప్రాణాలు !
బెంగళూరు: బెంగళూరు నగరంలో కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం శిథిలాల కింద 10 మందికి పైగా చిక్కుకున్నారని బెంగళూరు నగర పోలీసు కమిషన్ టీ. సునీల్ కుమార్ చెప్పారు. 9 మంది కార్మికులకు తీవ్రగాయాలైనాయని పోలీసు కమిషన్ సునీల్ కుమార్ అన్నారు.
Recommended Video


స్కూటర్ మీద కుర్చుంటే
కుప్పకూలిన భవనం పక్కన ఇద్దరు ఆక్టీవా స్కూటర్ మీద కుర్చుని మాట్లాడుతున్న సమయంలో శిథిలాలు వారి మీద పడ్డాయి. స్కూటర్ మీద కుర్చుని ఉన్న ఇద్దరినీ గురువారం రాత్రి రక్షించి సెయింట్ జాయిన్స్ ఆసుపత్రికి తరలించారని, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు.

క్షణాల్లో ప్రాణలు
అదే కట్టడంలో పని చేస్తున్న ఉత్తర భారతదేశానికి చెందిన రఘువీర్ రెండు నిమిషాల ముందు సమీపంలోని అంగడికి వెళ్లి సిగరేట్ తీసుకోవడానికి బయటకు వచ్చాడు. భవనంలోపలికి వెలుతున్న సమయంలో కుప్పకూలిపోయింది. ఆ సమయంలో రఘువీర్ బయటకు పరుగు తియ్యడంతో గాయలతో ప్రాణాలు రక్షించుకున్నాడు.

యజమాని దురాశ
ఇంటి యజమాని పాత కట్టడం మీద మరో మూడు అంతస్తులు నిర్మించి అద్దెకు ఇవ్వాలని ప్రయత్నించాడని, పునాదులు గట్టిగా లేకపోవడంతో భవనం కుప్పకూలిపోయిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందిద.

10 మంది గల్లంతు
కుప్పకూలిన భవనాన్ని బెంగళూరు మేయర్ సంపత్ రాజ్ పరిశీలించారు. తీవ్రగాయాలైన బాధితుల చికిత్సకు బీబీఎంపీ భరిస్తుందని సంపత్ రాజ్ హామీ ఇచ్చారు. కట్టడం యజమాని వివరాలు తెలియడం లేదని, వివరాలు సేకరిస్తున్నామని, 10 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని సంపత్ రాజ్ అన్నారు.

ట్రాన్స్ ఫారం
నాలుగు అంతస్తుల భవనం శిథిలాలు పక్కనే ఉన్న ట్రాన్స్ ఫారం మీద పడటంతో అది కుప్పకూలిపోయింది. ఈ దెబ్బతో కుప్పకూలిన కట్టడం పరిసర ప్రాంతాల్లో అర్దకిలో మీటర్ల పరిధిలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications