ముంబైపై 26/11 దాడికి పదమూడేళ్లు పూర్తి-ఇప్పటికీ తీరని ప్రతీకారం- పాక్ పై పోరులో కరవైన చిత్తశుద్ధి ?

సరిగ్గా పదమూడేళ్ల క్రితం భారతదేశ వాణిజ్య రాజధాని ముంబైపై పాకిస్తాన్ ముష్కరులు విరుచుకుపడ్డారు. హాలీవుడ్ సినిమా తరహాలో విచక్షణా రహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఏకంగా 150 మందికి పైగా అమాయక పౌరుల్ని పొట్టనబెట్టుకున్నారు. దీంతో భారత్ గుండెకు గాయమైంది. దీనిపై కచ్చితంగా దీటైన ప్రతీకారం తీర్చుకుంటామని అప్పట్లో కేంద్రం ప్రకటించింది. కానీ ఈ పదేళ్లలో రెండు ప్రభుత్వాలు మారాయి. అయినా ఇప్పటికీ పాకిస్తాన్ పై సరైన దాడి చేయడంలో వైఫల్యం సగటు భారతీయుల్ని తీవ్రంగా నిరాశపరుస్తోంది.

ముంబై 26/11 దాడి

ముంబై 26/11 దాడి

భారత దేశ వాణిజ్య రాజధాని ముంబైను పాకిస్తాన్ ఎప్పటినుంచో టార్గెట్ లో పెట్టుకుంది. ముంబైను దెబ్బతీస్తే భారత్ ను దెబ్బతీసినట్లేనని భావించింది. అదను చూసి సముద్ర మార్గంలో ముష్కరులను పంపింది. ముంబై తీరంలో అక్రమ మార్గాల్లో చొరబడిన ఉగ్రవాదులు నవంబర్ 26 రాత్రి దాడులకు దిగారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ తో పాటు పలు ఇతర చోట్ల వరుస దాడులకు దిగారు. ఈ దాడుల్లో పాల్గొన్న పలువురు తీవ్రవాదుల్ని ముంబై ఏటీఎస్ కాల్చి చంపేసింది. చివరికి అజ్మల్ కసబ్ అనే ఓ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకుంది. ఆ తర్వాత కసబ్ కు ఉరిశిక్ష విధించారు. అయితే ఈ దాడికి కుట్ర పన్నిన వారిని పట్టుకోవడంలో కానీ, ప్రతీకారం తీర్చుకోవడంలో కానీ భారత్ విఫలమవుతూనే ఉంది.

 పాక్ హస్తం నిరూపించినా

పాక్ హస్తం నిరూపించినా

ముంబైపై జరిపిన 26/11 దాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని నిరూపించడానికి భారత్ అజ్మల్ కసబ్ రూపంలో బలమైన సాక్ష్యాన్ని పట్టుకోగలిగింది. తొలిసారి భారత్ ఇంత పెద్ద సాక్ష్యం సేకరించగలిగింది. అయితే దీన్ని వాడుకుని పాకిస్తాన్ ను టార్గెట్ చేయడంలో మాత్రం కేంద్రం విఫలమైంది. ముఖ్యంగా అప్పట్లో అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్ మెతకవైఖరితో వ్యవహరించిందనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా అప్పట్లో యూపీఏలో కేంద్ర మంత్రిగా పనిచేసిన మనీష్ తివారీ తన తాజా పుస్తకంలో ఇవే ఆరోపణలు చేశారు. అయితే యూపీఏ మాత్రమే కాదు ఆ తర్వాత వచ్చిన ఎన్డీయే సర్కార్ సైతం పాకిస్తాన్ పై పూర్తిస్ధాయి దాడికి దిగలేకపోయింది.

 సైన్యం సిద్ధంగా ఉన్నా

సైన్యం సిద్ధంగా ఉన్నా

పాకిస్తాన్ పై పూర్తిస్ధాయి దాడికి సిద్ధంగానే ఉన్నట్లు 26/11తో పాటు గతంలో జరిగిన పలు దాడుల సందర్భంగా అనేక సార్లు కేంద్రానికి భరోసా ఇచ్చింది. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ పై దాడులకు సిద్దం కాలేదు. మధ్యలో బాలా కోట్ లో మెరుపుదాడులు మినహాయిస్తే పాకిస్తాన్ పై పూర్తిస్ధాయి యుద్ధానికి మాత్రం సన్నద్ధం కావడం లేదు. పాకిస్తాన్ ను అంతర్జాతీయ వేదికలపై ఇరుకునపెడుతున్నామని చెప్పుకోవడం మినహాయిస్తే గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. దీంతో సైన్యం నుంచి పూర్తిస్ధాయి మద్దతు కలిగిన ప్రభుత్వాలు ఎందుకు పాకిస్తాన్ పై సరైన దాడికి సిద్ధం కావడం లేదన్న అనుమానాలూ పెరుగుతున్నాయి.

ప్రతీకారం తెలియని రాజకీయం

ప్రతీకారం తెలియని రాజకీయం


రాజకీయాలకు పెట్టింది పేరైన భారత్ లో నేతల చిత్తశుద్దిపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ దేశ ప్రయోజనాలతో ముడిపడిన భద్రతా వ్యవహారాల్లో సైతం అదే రాజకీయాలు కనిపించడం సగటు భారతీయుల్ని విస్మయానికి గురిచేస్తోంది ముఖ్యంగా దేశానికి గుండెకాయ వంటి ముంబైపై 26/11 తరహా దాడి జరిగినప్పుడు భారత్ వ్యవహరించాల్సిన తీరు మాత్రం ఇది కాదనే చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ పై పూర్తిస్ధాయి యుద్ధానికి సైన్యం సిద్ధమైనప్పటికీ రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇందుకు కేంద్రం సిద్ధం కాలేదు. అలాగని అప్పుడు, ఇప్పుడు విపక్షాలు సైతం ఇందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. దీంతో మరో 26/11 దాడి జరిగినా ఇదే పరిస్ధితి ఉంటుందని జనం పెదవి విరుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+