కుప్పకూలిన భవనం: 12మంది మృతి, శిథిలాల కింద 30మంది
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్‌కోపర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఓ నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలిపోయింది.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్‌కోపర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఓ నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలిపోయింది.
ఈ ఘటనలో 12మంది మృతి చెందగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే ముంబై విపత్తు నిర్వహణ బృందానికి సమాచారమిచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

భవన శిథిలాల కింద 30 నుంచి 40 మంది వరకు చిక్కుకుని ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 9 మందిని రక్షించారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయని బీఎంసీ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications