75 ఏళ్ళలో ఇద్దరితో అఫైర్: హత్య చేసి, పక్కనే పడుకొన్న భార్య
ముంబై: క్షణికావేశంలో భర్తను చంపేసి మృతదేహం పక్కనే పడుకొన్న భార్య ఉదంతమిది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది. ముంబైలోని చెంబూరు మురికివాడ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది.
ముంబైలోని చోటీలాల్ మౌర్య అనే 70 ఏళ్ళ వ్యక్తికి 40 ఏళ్ళ క్రితం ధన్‌దేవితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. గత కొంత కాలంగా మౌర్య మరో ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఈ కారణంగా భార్యతో చోటీలాల్ మౌర్య తరచూ గొడవకు దిగేవాడు.అంతేకాదు కుటుంబాన్ని కూడ పట్టించుకొనేవాడు. ఇంటికి వస్తే చిన్న విషయానికే భార్యతో ఘర్షణ పడేవాడు. రెండు రోజుల క్రితం కూడ చోటీలాల్ ఇంటికి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. భార్యతో తీవ్రంగా గొడవపడి ఇంట్లో నుండి బయటకు వచ్చి నిద్రించాడు.
అయితే ఇంటి నుండి బయటకు వచ్చిన ధన్‌దేవీ భర్తపై బండరాయితో కొట్టి చంపేసింది. అంతేకాకుండా రాత్రంతా శవం పక్కనే పడుకొంది. ఇలా చేయడం వల్ల తనపై ఎవరికీ కూడ అనుమానం రాదని ఆమె భావించింది.
అయితే తెల్లవారుజామున పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు రక్తపు మడుగులో ఉన్న చోటీలాల్ మౌర్యను చూశారు. ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు.
అయితే చోటీలాల్ మౌర్య భార్య ధన్‌దేవీని విచారిస్తే ఎట్టకేలకు అసలు విషయాన్ని ఆమె ఒప్పుకొంది. తనను వేధింపులకు గురిచేయడం వల్లే తానే తన భర్తను హత్య చేసినట్టు ఆమె చెప్పింది.దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు












Click it and Unblock the Notifications