బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది.. ఈ స్టేషన్ల మధ్య.. గంటకు 320 కి. మీ. వేగంతో..
బుల్లెట్ ట్రైన్.. భారతీయుల ఏళ్లనాటి కల. ఎప్పటినుంచో ఈ అత్యాధునిక రైలు కోసం యావత్ భారతావని ఎదురుచూస్తోంది. తాజాగా బుల్లెట్ ట్రైన్ సేవలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. బుల్లెట్ ట్రైన్ సేవలు భారత్ లో 2027 ఆగస్టు నాటికి ప్రారంభం కానున్నాయని స్పష్టం చేశారు. భారత్ లో బుల్లెట్ ట్రైన్ సేవల కోసం జపాన్ తో మన దేశం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కింద ముంబై- అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ ను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా గంటకు 320 కి. మీ వేగంతో బుల్లెట్ ట్రైన్ ప్రయాణించనుంది. ఈ రైలు ముంబై- అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ పురోగతిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఈ రైలు సర్వీసులు 2027 ఆగస్టు నాటికి ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, జపాన్ కు చెందిన ల్యాండ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మంత్రి హిరోమసా నకానో కలిసి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ లో భాగంగా సూరత్, ముంబైలోని సైట్లను పరిశీలించారు. మెహసానాలోని గణపత్ యూనివర్సిటీ లో జరిగిన సమావేశంలో అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. " బుల్లెట్ రైలు సేవలు దేశంలో ఎలా స్పీడుగా ముందుకు సాగుతున్నాయో మీకు తెలిసిందే. గుజరాత్ లో వేగంగా పనులు జరుగుతున్నాయి. వైర్ డక్ట్స్ పూర్తయ్యాయి. గిర్డర్స్ ను అమర్చాం. ట్రాక్స్, ఎలక్ట్రిక్ వైరింగ్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల జపాన్ మంత్రి నకానో.. గుజరాత్ లో పర్యటించి బుల్లెట్ ట్రైన్ పనులను సమీక్షించారు. 2027 ఆగస్టు నాటికి తొలి బుల్లెట్ రైలును పరుగులు పెట్టించాలని టార్గెట్ పెట్టుకున్నాం" అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.

ముంబై- అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ ఒప్పందం భారత్- జపాన్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. 508 కి. మీ. దూరంలో 12 స్టేషన్లు ఉన్నాయి. అవి ముంబై(బంద్రా కుర్లా కాంప్లెక్స్), థానే, విరార్, బయోసార్, వాపి, బిలిమోర, సూరత్, భరుచ్, వడోదరా, ఆనంద్/ నడియాద్, అహ్మదాబాద్, సబర్మతి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన 2017 అహ్మదాబాద్ లోని సబర్మతి స్టేషన్ లో ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా జరిగింది. ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ. 1.1 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పటికే దాదాపు 323 కిలోమీటర్ల మేర పనులు పూర్తయినట్లు సమాచారం. 17 నదీ బ్రిడ్జ్ లను నిర్మించినట్లు తెలుస్తోంది. బుల్లెట్ ట్రైన్ రాకతో భారతీయులకు ప్రయాణ సమయం మరింత ఆదా కానుంది.












Click it and Unblock the Notifications