విమానం నుంచి కిందపడిన ఎయిర్‌హోస్టెస్: తీవ్ర గాయాలు
ముంబై: ఎయిరిండియా విమానానికి చెందిన ఎయిర్‌హోస్టెస్ ప్రమాదవశాత్తు విమానం నుంచి కిందపడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది.
సోమవారం ఉదయం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానంలో ప్రయాణికులంతా ఎక్కిన తర్వాత 53ఏళ్ల ఎయిర్‌హోస్టెస్ విమానం తలుపు మూయబోతూ ప్రమాదవశాత్తు విమానం నుంచి కింద పడిపోయారు. దీంతో ఆమె కాలు విరిగింది.

బోయింగ్-777 విమానం తలుపు మూస్తుండగా తమ సిబ్బందిలో ఒకరైన హర్షా లోబో దురదృష్టవశాత్తు కింద పడిపోయారని ఎయిరిండియా వెల్లడించింది. ఆమె కాళ్లకు తీవ్ర గాయాలవ్వడంతో నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications